AR Murugadoss | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరు ఏఆర్ మురుగదాస్. ఒకానొక టైంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ స్టార్ డైరెక్టర్ కొంతకాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. చివరగా బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్‌తో ప్రేక్షకుల ముందుకు రాగా బాక్సాఫీస్ వద్ద ఢీలా పడిపోయింది. ఆ తర్వాత కోలీవుడ్ యాక్టర్ శివకార్తికేయన్ యాక్షన్ థ్రిల్లర్ మదరాసిని డైరెక్ట్ చేయగా.. ఈ చిత్రానికి సికిందర్ కంటే మంచి స్పందన వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో బ్రేక్ మాత్రం ఇవ్వలేకపోయింది.
చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఏఆర్ మురుగదాస్ ఈ సారి మరో స్టార్ యాక్టర్‌తో తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త కోలీవుడ్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఇంతకీ ఎవరా యాక్టర్ అనుకుంటున్నారా..? శింబు. ఈ లీడింగ్ యాక్టర్‌తో కమర్షియల్ ఎంటర్టైనర్ను ప్లాన్ చేస్తున్నాడట మురుగదాస్. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై మురుగదాస్, శింబు మధ్య చర్చలు కొనసాగుతున్నాయని ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం శింబు వెట్రిమారన్ డైరెక్షన్లో అరసన్ సినిమా చేస్తున్నాడు. వడా చెన్నై యూనివర్స్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
శింబు మరోవైపు ఓ మై కడవులే, డ్రాగన్ ఫేం అశ్వత్ మారిమత్తు డైరెక్షన్లో కొత్త సినిమా మొదలుపెట్టేందుకు కూడా రెడీ అవుతున్నాడు. మరి రెండు సినిమాలతో బిజీగా ఉన్న శింబు సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఏఆర్ మురుగదాస్‌తో సినిమా చేస్తాడా..? అనేది చూడాలి.
Golla Ramavva | తెలంగాణ సాయుధ పోరాట దృశ్యకావ్యం.. ఘనంగా ‘గొల్ల రామవ్వ’ ట్రైలర్ లాంచ్
Sushmita Konidela | బాక్సాఫీస్ వద్ద ‘శంకర వరప్రసాద్’ హవా.. వైరల్ అవుతున్న మెగా యానిమేషన్ వీడియో!
Border 2 | గల్ఫ్ దేశాల్లో ఇండియన్ సినిమాలపై నిషేధం.. అప్పుడు ‘ధురంధర్’ ఇప్పుడు ‘బోర్డర్ 2’