Sushmita Konidela | ఈ ఏడాది సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. సినిమా సూపర్ హిట్ కావడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, చిరంజీవి కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెల తన తండ్రిపై ఉన్న అభిమానాన్ని చాటే ఒక ప్రత్యేకమైన యానిమేషన్ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చిరంజీవి సినిమా విడుదల కావడానికి ముందే రామ్ చరణ్ అభిమానులు ఎంతో క్రియేటివ్‌గా ఈ యానిమేషన్ వీడియోను రూపొందించారు. ఈ వీడియోను షేర్ చేస్తూ సుస్మిత భావోద్వేగానికి లోనయ్యారు. “కాలం మారినా, తరాలు మారినా, ఆయనపై (చిరంజీవి) మీకున్న ప్రేమ, ఆప్యాయత, గౌరవం మాటల్లో చెప్పలేని అమూల్యమైన భావన” అని కొనియాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
It’s truly heartwarming to witness the stunning Welcome Title Animation of Megastar #Chiranjeevi garu, lovingly created by fans and screened before the opening credits of #ManaShankaraVaraPrasadGaru.
This beautiful gesture speaks volumes about the timeless love, respect, and… pic.twitter.com/z6nmqBTxWs
— Sushmita Konidela (@sushkonidela) January 22, 2026