Aparna Das | కోలీవుడ్ హీరోయిన్ అపర్ణా దాస్ పెళ్లి పీటలెక్కింది. తన ప్రియుడు నటుడు దీపక్ పరమాతో కలిసి బుధవారం ఏడడుగులు వేసింది. తన పెళ్లికి ముందు హల్దీ వేడుక, సంగీత్ ఫంక్షన్లు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న ఈ జంట తాజాగా పెళ్లి చేసుకున్నట్లు అనౌన్స్ చేసింది. వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
అపర్ణా దాస్ తమిళంలో వచ్చిన విజయ్ బీస్ట్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం అనంతరం కవిన్తో దాదాలో నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక తెలుగులో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ చిత్రంలో కీలక పాత్ర పోషించింది.
Finally ♥️♥️♥️ pic.twitter.com/MvetBHES3N
— Aparna Das (@Aparna_OffI) April 24, 2024