ఎన్ని ఓట్లు వస్తే అన్ని మొక్కలు నాటుతా
తమను గెలిపిస్తే రోడ్లు వేస్తాం, కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తాం అంటూ రకరకాల హామీలు ఇచ్చే అభ్యర్థులను చాలామందినే చూశాం. కానీ, పశ్చిమ బెంగాల్‌లోని ఘటల్ లోక్‌సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దీపక్ అధికారి(దేవ్) రూటు సపరేటు.
- ఓటర్లకు బెంగాల్ నటుడు దేవ్ ఆఫర్
- నామినేషన్ వేసే ముందు రక్తదానం
కోల్‌కతా, మే 3: తమను గెలిపిస్తే రోడ్లు వేస్తాం, కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తాం అంటూ రకరకాల హామీలు ఇచ్చే అభ్యర్థులను చాలామందినే చూశాం. కానీ, పశ్చిమ బెంగాల్‌లోని ఘటల్ లోక్‌సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దీపక్ అధికారి(దేవ్) రూటు సపరేటు. తనకు వేసే ఓట్లకు బదులుగా మొక్కలు నాటుతానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. తనకు ఎన్ని ఓట్లు పోలైతే అన్ని మొక్కలు నాటుతానని ప్రకటించారు. తనకు తొమ్మిది లక్షల ఓట్లు వస్తే.. తొమ్మిది లక్షల మొక్కలు నాటుతానని చెప్పారు. అంతేకాదు, నామినేషన్ వేసే విషయంలోనూ ఆయన అందరు అభ్యర్థులకు భిన్నంగా వ్యవహరించారు.
ముందుగా రక్తదానం చేసి, ఆ తర్వాత నామినేషన్ వేశారు. ప్రస్తుతం బ్లడ్ బ్యాంకులు రక్తం కొరతతో సంక్షోభంలో ఉన్నాయని, ప్రజలు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలనే ఆలోచనతో ఈ పని చేసినట్టు ఆయన ప్రకటించారు. బెంగాల్ నటుడైన దేవ్ 2014, 2019లో ఘటల్ నుంచి ఎంపీగా విజయం సాధించి మూడోసారి బరిలో నిలిచారు. కాగా, దేవ్‌ను బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోశ్ కుమార్ అభినందించారు. రాజకీయ లక్ష్యాన్ని పర్యావరణ సుస్థిరతతో మేళవించేలా ఈ నిర్ణయం ఉన్నదని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
Telugu University | ఏపీ ఎమ్మెల్యేకు తెలంగాణ పురస్కారం..! వివాదాస్పదంగా మారిన తెలుగు యూనివర్సిటీ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

