Pawan kalyan | ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan) పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి నుంచి తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు పవన్ కల్యాణ్ 53 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ.. విజయం విక్టరీ దిశగా పయనిస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీత వెనుకంజలో ఉన్నారు.
పవన్ కల్యాణ్ అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చే దిశగా వెళ్తున్న నేపథ్యంలో టాలీవుడ్ యాక్టర్ సాయి దుర్గ తేజ్ ఎక్స్‌లో తన స్పందనను షేర్ చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత, భవిష్యత్తు ఇప్పుడు సురక్షితమైన చేతుల్లో ఉంది. పవర్ తుఫాను అంటూ ట్వీట్ చేశాడు. పవన్‌కల్యాణ్ ఓ చిన్నారిని ఎత్తుకున్న స్టిల్ షేర్ చేయగా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
The Present & Future of Andhra Pradesh is now in safe hands.
POWER STORM @JanaSenaParty 💪🏼💪🏼💪🏼 pic.twitter.com/zM3QPlt7WZ
— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 4, 2024