అమరావతి : ప్రభాష్ నటించిన కల్కి 2898 ఏడి చిత్రానికి (Kalki 2898 AD movie) ఏపీ ప్రభుత్వం (AP Government) తీపి కబురు అందజేసింది. ఇప్పటికే ఐదు షోలకు, థియేటర్ల సినిమా ధరల పెంపునకు అనుమతించిన విషయం తెలిసిందే. తాజాగా సినిమా విడుదలవుతున్న తొలిరోజు గురువారం ఆరో షో (Sixth Show) కు కూడా అనుమతినిచ్చింది . అయితే విడుదల రోజు ఒక్కరోజు మాత్రమే ఆరో షోకు అనుమతినిస్తున్నట్లు వెల్లడించింది.
మరోవైపు ఈ సినిమా స్పెషల్ షోలు నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana government) కూడా ఇచ్చింది. ఐదు షోలు వేసేందుకు, టికెట్ ధర రూ.200 పెంచుకునేందుకూ హోంశాఖ వారికి అనుమతులు ఇచ్చింది. అలాగే రూ.75, రూ.100 టిక్కెట్ల ధరలనూ పెంచుకునేందుకూ అనుమతులు ఇచ్చింది. ఇక పెరిగిన ధరలను బట్టి టికెట్ల రేట్లను చూసుకుంటే.. బెనిఫిట్ షోల రేట్లు.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.377 గా.. మల్టీప్లెక్స్‌లలో రూ.495 గా ఉండబోతుంది.
ఇక బెనిఫిట్ షో అనంతరం రెగ్యులర్ షోల రేట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.265 ఉండగా.. మల్టీప్లెక్స్‌లలో రూ. 413 గా నిర్ణయించారు. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న వైజయంతీ మూవీస్ తెరకెక్కించిన కల్కి మూవీలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా, బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటిస్తున్నాడు. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.