Game Changer | తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ కథానాయకుడిగా వస్తున్న గేమ్‌ఛేంజర్ సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతినిచ్చింది. అర్ధరాత్రి ఒంటి గంట ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.
దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న గేమ్‌ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో టికెట్ల ధరలను మల్టీప్లెక్స్‌ల్లో అదనంగా రూ.175(జీఎస్టీతో కలిపి), సింగిల్ థియేటర్లలో రూ.135(జీఎస్టీతో కలిపి) వరకు పెంచుకునేందుకు అనుమతినిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఇవే ధరలు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ తేదీల్లో రోజుకు 5 షోలు నిర్వహించుకునేందుకు కూడా అనుమతినిచ్చింది.
విడుదల తేదీ అయిన జనవరి 10న మాత్రం ఆరు షోలు నిర్వహించుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఉదయం 4 గంటలకు ప్రత్యేక షో వేసుకునేందుకు అనుమతినిచ్చింది.
Game Changer