Anushka Next Film | దశాబ్ధన్నర కాలానికి పైగా వెండితెర జేజమ్మగా దక్షిణాదిన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనుష్క శెట్టి. ‘సూపర్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అనుష్క అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా స్టార్ స్టేటస్ దక్కించుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అయితే ప్రస్తుతం అనుష్క సినిమాల వేగాన్ని తగ్గించింది. ప్రతి ఏడాది రెండు మూడు సినిమాలతో బిజీగా ఉంటే స్వీటీ.. ఇప్పుడు ఏడాదికి ఒక్క సినిమా కూడా చేయట్లేదు. నిశ్శబ్ధం తర్వాత ఇప్పటివరకు అనుష్క నుండి మరో సినిమా రాలేదు. కాగా నిశ్శబ్ధం సినిమా కూడా నేరుగా ఓటీటీలోనే రిలీజైంది. దాంతో అనుష్క అభిమానులు ఆమె సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం అనుష్క, నవీన్ పొలిశెట్టితో కలిసి ఓ రోమ్-కామ్ సినిమా చేస్తుంది. ఇటీవలే రిలీజైన ఈమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. కాగా అనుష్క నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వంలో అనుష్క తన 49వ సినిమాను చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు దర్శకుడు ఏ.ఎల్ విజయ్ తెలిపాడు. మహిళా ప్రధానంగా సాగనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.
Read Also:
రెండు డబ్బింగ్ సినిమాలతో పోటీ పడనున్న అల్లరినరేష్.. గెలుపెవరిది?
తెలుగులో అరుదైన రికార్డుకు దగ్గరలో కాంతార.. టాప్-3 ప్లేస్‌ను కైవసం చేసుకుంటుందా?
Thalapathy Vijay | 14 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్‌తో జోడీ కట్టనున్న దళపతి విజయ్?
Dhamaka Movie | అగ్ర ఓటీటీ సంస్థకు ధమాకా పోస్ట్-థియేట్రికల్ హక్కులు..!