Thalapathy Vijay | 14 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్‌తో జోడీ కట్టనున్న దళపతి విజయ్?
Thalapathy67 | కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో క్రేజ్ సంపాదించుకున్నాడు దళపతి విజయ్. 'తుపాకి' సినిమా నుండి 'బీస్ట్' వరకు ప్రతి సినిమాకు మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా తెలుగు నిర్మాణ సంస్థలో తెలుగు దర్శకుడితోనే 'వారసుడు' సినిమా చేస్తున్నాడు.
Thalapathy67 | కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో క్రేజ్ సంపాదించుకున్నాడు దళపతి విజయ్. ‘తుపాకి’ సినిమా నుండి ‘బీస్ట్’ వరకు ప్రతి సినిమాకు మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా తెలుగు నిర్మాణ సంస్థలో తెలుగు దర్శకుడితోనే ‘వారసుడు’ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత విజయ్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రాన్ని చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టంట వైరల్‌గా మారింది.
ఈ సినిమాలో హీరోయిన్గా దాదాపు త్రిష కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తుంది. ఇదే గనుక నిజమైతే దాదాపు 14ఏళ్ళ తర్వాత వీరిద్దరూ కలిసి నటించనున్నారు. వీళ్ళ కాంబోలో ఇప్పటికే 4 సినిమాలు తెరకెక్కాయి. ఆ నాలుగు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్లుగా నిలిచాయి. వీరిద్దరు కలిసి చివరిగా 2008లో వచ్చిన ‘కురివి’ చిత్రంలో నటించారు. పద్నాలుగు సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి నటించనుండటంతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. ఇటీవలే త్రిష పొన్నియన్ సెల్వన్‌తో మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగు సినిమాలున్నాయి.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం LCUలో భాగంగానే తెరకెక్కనున్నట్లు ఇటీవలే నటుడు నారైన్ తెలిపాడు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

