తెలుగులో అరుదైన రికార్డుకు దగ్గరలో కాంతార.. టాప్-3 ప్లేస్‌ను కైవసం చేసుకుంటుందా?
Kantara Movie | ఇంకా కొన్ని చోట్ల ‘కాంతార’ హవానే నడుస్తుంది. ప్రతి వారం కొత్త సినిమాలు రిలీజవుతున్నా కూడా ఈ చిత్రానికి ఆధరణ తగ్గడం లేదు. కొత్త సినిమాలకు సమానంగా కలెక్షన్లు సాధిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది.
Kantara Movie | ఇంకా కొన్ని చోట్ల ‘కాంతార’ హవానే నడుస్తుంది. ప్రతి వారం కొత్త సినిమాలు రిలీజవుతున్నా కూడా ఈ చిత్రానికి ఆధరణ తగ్గడం లేదు. కొత్త సినిమాలకు సమానంగా కలెక్షన్లు సాధిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 30న మాతృక భాష కన్నడలో రిలీజైన ఈ చిత్రం తెలుగులో అక్టోబర్ 15న రిలీజైంది. తెలుగులో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ రిలీజ్ చేశాడు. తెలుగులో రెండు కోట్ల బ్రేక్ ఈవెన్‌తో రంగంలోకి దిగిన ఈ చిత్రం మొదటి రోజే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు సినీ చరిత్రలోనే అలా రిలీజైన మొదటి రోజే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న సినిమా లేదు.
ఇదిలా ఉంటే ఈ చిత్రం తెలుగులో మరో అరుదైన ఘనతకు దగ్గరలో ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రం తెలుగులో రూ.65.50 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. కలెక్షన్ల పరంగా చూసుకుంటే తెలుగులో అత్యధికంగా వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాలలో కాంతార నాల్గొవ స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో కేజీఎఫ్(రూ.185 కోట్లు), రోబో(రూ.100 కోట్లు), రోబో 2.౦( రూ.72 కోట్లు) చిత్రాలు ఉన్నాయి. ఇక కాంతార మరో రూ.7 కోట్లు సాధిస్తే రోబో 2.౦ రికార్డు బ్రేక్ చేసి టాప్-3 ప్లేస్‌లో నిలుస్తుంది.
అయితే ఈ వారం మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందులో భేదియా సినిమాను గీతాఆర్ట్స్ సంస్థ రిలీజ్ చేస్తుంది. దాంతో కాంతారకు థియేటర్ల సంఖ్య భారీగా తగ్గనుంది. ఒక వేళ భేదియాకు నెగెటీవ్ టాక్ వస్తే.. కాంతారకు తిరిగి థియేటర్లు వచ్చే చాన్స్ ఉంది. కానీ భేదియాకు పాజిటీవ్ టాక్ వస్తే కాంతార దాదాపు థియేటర్లలో నుండి వెళ్లిపోయినట్లే. ఏమున్నా రానున్న నాలుగు రోజుల్లోనే ఈ చిత్రానికి అ రికార్డు సాధించే చాన్స్ ఉంది.
Read Also:
Hrithik Roshan | లగ్జరీ అపార్టుమెంట్‌ను కొనుగోలు చేసిన హృతిక్ రోషన్.. ధర ఎంతో తెలుసా?
Project-K Movie | నాలుగు సెట్లు 40కోట్లు.. ప్రాజెక్ట్-K కోసం నాగ్ అశ్విన్ భారీ ప్లాన్..!
రెండు డబ్బింగ్ సినిమాలతో పోటీ పడనున్న అల్లరినరేష్.. గెలుపెవరిది?
Kalyan Ram | బీస్ట్ మోడ్‌లో కళ్యాణ్‌రామ్.. డెవిల్ కోసం కసరత్తులు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ T20I | న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

