Hrithik Roshan New Apartment | బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నార్త్‌కు సమానంగా సౌత్‌లోనూ విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. కాగా హృతిక్ తన భార్య సుసన్నే ఖాన్‌తో విడాకుల తర్వాత సబా అజాద్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి పలు పార్టీలకు, పబ్బులకు వెళ్తూ మీడియా కంటపడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇన్ని రోజులు వీరిద్దరూ ఎవరింట్లో వాళ్ళు ఉండగా.. ఇప్పుడు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారట. దానికోసం హృతిక్ రోషన్ ఓ ఖరీదైన ఇల్లును కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.
బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం హృతిక్ రోషన్ ముంబైలోని ఓ బీచ్ హౌస్‌ను రూ.100 కోట్లు పెట్టి కొన్నాడట. రెండు అపార్టుమెంట్లుగా ఉన్న ఈ నివాసంలో హృతిక్, సబా అజాద్లో కలిసి ఉండబోతున్నాడట. 38వేల చదరపు అడుగులు విస్తీర్ణంతో ఉన్న ఈ రెండు అపార్టుమెంట్ల నుండి అరేబియా సముద్రం క్లియర్‌గా కనిపిస్తుందట. హృతిక్-సబా అజాద్ గత కొంత కాలంగా డేటింగ్లో ఉన్నారు. ఇటీవలే సబా, హృతిక్ ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలబ్రెషన్స్ జరుపుకుంది. హృతిక్ రోషన్ గతంలో ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ సుసన్నే ఖాన్‌ను 2000లో పెళ్లి చేసుకున్నాడు. కాగా వీరిద్ధరి మధ్య మనస్పర్థలు రావడంతో 2014లో విడాకులు తీసుకున్నారు. వీరికిద్దరు పిల్లలు.