Dhamaka Movie Ott Plat Form | మాస్‌రాజా రవితేజ ప్రస్తుతం ఒక భారీ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. ‘క్రాక్’ వంటి భారీ విజయం తర్వాత ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో రవితేజ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన ఆశలన్నీ ‘ధమాకా’ పైనే ఉన్నాయి. త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్23న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ను ప్రకటించారు.
ఈ సినిమా డిజిటల్ హక్కులను ‘ఆహా’ సంస్థ దక్కించుకుంది. కాగా ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం ఆహా సంస్థ భారీ ధర వెచ్చించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవితేజకు జోడీగా ‘పెళ్ళి సందD’ ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు అందిస్తున్నాడు.
Read Also:
రెండు డబ్బింగ్ సినిమాలతో పోటీ పడనున్న అల్లరినరేష్.. గెలుపెవరిది?
తెలుగులో అరుదైన రికార్డుకు దగ్గరలో కాంతార.. టాప్-3 ప్లేస్‌ను కైవసం చేసుకుంటుందా?
Thalapathy Vijay | 14 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్‌తో జోడీ కట్టనున్న దళపతి విజయ్?
Yashoda Movie | బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న యశోద.. సమంత ఖాతాలో మరో హిట్టు..!