అనుష్కను ముద్దుగా స్వీటీ అని పిలుస్తుంటారు. ఇంట్లో ఆమె నిక్ నేమ్ ఇండస్ట్రీ పిలుపూ అయ్యింది. అనుష్క వ్యక్తిత్వానికి ఈ ముద్దు పేరు ఒకరకంగా మా రుపేరని అంటారు ఆమె గురించి తెలిసినవారు. తెరపై ఆమె తన అభిమానులను పలకరించి రెండేండ్లు దాటింది. ప్రస్తుతం అనుష్క తన 48వ చిత్రంలో నటిస్తున్నది. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరో. పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. మధ్య వయస్కురాలైన ఓ చెఫ్, ఓ యువకుడి మధ్య సాగే ప్రేమ కథ ఈ సినిమాకు నేపథ్యం. ఇందులో చెఫ్ అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క నటిస్తున్నది. రెగ్యులర్ చిత్రీకరణ గతంలో ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా సెట్లో స్వీటీ జాయిన్ అయ్యింది. ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా క్యారెక్టర్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఈ పోస్టర్లో సన్నబడిన అను ష్క తన వింటేజ్ లుక్‌ను గుర్తుచేసింది. సినిమా కూడా ఆ మెకు మరో కొత్త ఇన్నింగ్స్ ఇ స్తుందనే చిత్రబృందం చెబుతున్నది.