Anushka Shetty | అనుష్క లీడ్రోల్లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘ఘాటి’ అనే పేరుని ఖరారు చేశారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటైర్టెన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మూడు రోజులు మాత్రమే మిగిలివుంది. సరిగ్గా మూడో రోజు అనుష్క పుట్టినరోజు.
అదే రోజు ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుండటంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సినిమా ఫస్ట్‌లుక్‌తోపాటు, స్పెషల్ గ్లింప్స్‌ని కూడా మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కూడా ఆ రోజే వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు. ‘వేదం’ తర్వాత క్రిష్ దర్శకత్వంలో అనుష్క నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.