3 ఇడియట్స్ సినిమా కోసం అనుష్క శర్మ ఆడిషన్ .. వీడియో వైరల్

బాలీవుడ్ నటి అనుష్క శర్మ తొలిసారి రబ్ నే బనా ది జోడి అనే చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. 2008లో వచ్చిన ఈ చిత్రంలో షారూఖ్ సరసన నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత సుల్తాన్ ,ఎన్ హెచ్ 10, బ్యాండ్ బాజా బారత్, దిల్ దిడక్నే దో, ఏ దిల్ హై ముష్కిల్ వంటి చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు నటిగానే కాదు నిర్మాతగాను రాణిస్తుంది. రీసెంట్గా వామిక అనే చిన్నారికి జన్మినచ్చిన అనుష్క కూతురు బాగోగులు చూసుకుంటూ హ్యాపీగా గడుపుతుంది.
అయితే అమీర్ ఖాన్, ఆర్ మాధవన్, షర్మాన్ జోషి, కరీనా కపూర్,బోమన్ ఇరానీ ప్రధాన పాత్రలలో రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన 3 ఇడియట్స్ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో ఛాన్స్ కోసం అనుష్క శర్మ ఆడిషన్‌కు వెళ్లగా, దానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 2009లో రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన 3 ఇడియట్స్ చిత్రం కోసం అనుష్క ఆడిషన్ ఇచ్చింది. ఇందులో సంజయ్ దత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మున్నాభాయ్ ఎంబిబిఎస్ నుండి గ్రేసీ సింగ్ డైలాగ్ చెప్పడం ఈ వీడియోలో గమనించవచ్చు. గ్రీన్ కలర్ డ్రెస్ ధరించిన అనుష్క వివిధ హావభావాలతో డైలాగ్ చెబుతుంది. ఈ వీడియో అభిమానులని ఆకట్టుకుండగా, దీనిని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
ఇవి కూడా చదవండి..
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి ఈటల ఫైర్
కూకట్‌పల్లిలో కాల్పుల కలకలం
తెలంగాణలో కొత్తగా 7,994 కరోనా కేసులు
కరోనా ఎఫెక్ట్.. చార్ధామ్ యాత్ర రద్దు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

