తేజస్, సౌజన్య శివ, జషిల్, శ్రీవల్లి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘అనుష్క’. సుధారాణి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై సుదర్శన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ట్రైలర్ను నిర్మాత ఆర్కే గౌడ్ విడుదల చేశారు. దర్శకనిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ…‘నేను గతంలో గ్రాఫిక్ డిజైనింగ్ విభాగంలో ‘అరుంధతి’ చిత్రానికి పనిచేశాను. దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంగా ఈ సినిమా రూపొందించాను. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం. అన్నారు.