Anushka Shetty | అరుంధతి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది బెంగళూరు భామ అనుష్కాశెట్టి (Anushka Shetty). ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించడమే కాకుండా.. అప్పటివరకు వస్తున్న హారర్ సినిమాలకు ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ అలాంటి రేంజ్లో బాహుబలిలో కనిపించింది అనుష్కా. దేవసేన పాత్రలో కుంతల రాజ్యం యువరాణిగా.. బాహుబలి భార్యగా అలరించింది. అయితే బాహుబలి తర్వాత ఈ బ్యూటీ చాలా రోజులు గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. రీసెంట్గా నవీన్ పొలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో హిట్ అందుకుంది. ఈ చిత్రంలో పెళ్లి చేసుకోకుండా తల్లి కావాలి అనే కోరికతో ఉన్న యువతి పాత్రలో అనుష్కా అందరిని మెప్పించింది. అయితే ఈ సినిమా అనంతరం వరుస ప్రాజెక్ట్‌లను లైన్లో పెడుతుంది ఈ భామ.
ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఘట్టి సినిమాలో నటిస్తున్న ఈ భామ మలయాళంలో కథనార్(Kathanar) అనే చిత్రంలో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీకి సంబంధించి అప్డేట్లను కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. మలయాళం కథానర్ విషయానికి వస్తే ఈ చిత్రం హారర్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్నట్లు తెలుస్తుంది. జయసూర్య, ప్రభుదేవ, ప్రేమదేశం వినీత్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇవే కాకుండా అనుష్క నటించిన బ్లాక్ బస్టర్ మూవీ భాగమతికి కూడా సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది.
Also Read..