Anurag Kashyap | అగ్ర దర్శకుడు, నటుడు అనురాగ్‌కశ్యప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను బాలీవుడ్ ఇండస్ట్రీని వదిలివేస్తున్నట్లు ఆయన తెలిపారు. హిందీ చిత్రసీమ కేవలం బాక్సాఫీస్ వసూళ్లపైనే దృష్టిపెడుతున్నదని, సృజనాత్మక స్వేచ్ఛ పూర్తిగా హరించుకుపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ పరిశ్రమ మొత్తం విషపూరితంగా మారిపోయిందని గత ఏడాది ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనురాగ్‌కశ్యప్ వ్యాఖ్యానించారు. అప్పటి నుంచే ఆయన బాలీవుడ్‌ను వీడే ప్రయత్నాల్లో ఉన్నారని అర్థమైంది.
త్వరలో ఆయన బెంగళూరుకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని, అక్కడే స్థిరపడతారని తెలుస్తున్నది. బాలీవుడ్లో ప్రతీ ఒక్కరూ భారీ లక్ష్యాలను ఎంచుకొని సినిమాలు తీస్తున్నారని, ప్రతిభకు ఏమాత్రం అవకాశం లేకుండా పోయిందని అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సైతం ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీపై విమర్శలు చేశారు. సినిమాలు తీస్తానంటే ముంబయి నిర్మాతలు తనను నమ్మడం లేదని, ఆరోగ్యకరమైన వాతావరణం కోసం దక్షిణాది ఇండస్ట్రీకి వెళ్లిపోతున్నానని ఆయన తెలిపారు.