నిర్మొహమాటంగా ‘నో’ చెబుతున్నా
నో చెప్పడం చేతకాని వారు జీవితంలో ఎదగలేరని ఆలస్యంగా తెలుసుకున్నాను అంటున్నది మలయాళ మందారం అనుపమ పరమేశ్వరన్.
నో చెప్పడం చేతకాని వారు జీవితంలో ఎదగలేరని ఆలస్యంగా తెలుసుకున్నాను అంటున్నది మలయాళ మందారం అనుపమ పరమేశ్వరన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘చిన్నప్పట్నుంచీ కుటుంబ బాధ్యతల్ని నెరవేర్చడమే కర్తవ్యంగా భావించా. నా వల్ల కుటుంబం ఇబ్బందులు పడకూడదనే భయమే నాలో ఎప్పుడూ ఉండేది. ఇలా చాలాకాలం నాకోసం నేను బతకడం మర్చిపోయా.
ఒత్తిడిని భరించడం వల్ల మానసిక ఆరోగ్యం పాడైంది. కొలిమిలో కాలితే తప్ప బంగారానికి వన్నె రాదంటారు. అలాగే.. నా జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలు నాలో మార్పును తెచ్చాయి. ఇప్పుడు కేవలం నాకోసం నేను బతుకుతున్నా. ఇన్నాళ్లూ ఇతరులకు ‘నో’ చెప్పలేక బాధపడ్డాను. ఇప్పుడు నిర్మొహమాటంగా ‘నో’ చెప్పేస్తున్నా. ఈ మార్పు వల్ల నా మనసిక ప్రశాంతత మెరుగుపడింది’ అంటూ చెప్పుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

