‘ఈ సినిమాలో నేను అందరికీ కనెక్ట్ అయ్యే పాత్రలో కనిపిస్తా. సినిమా బాగా నచ్చితే మీ మిత్రులందరికీ చూడమని చెప్పండి. కొత్తదనంతో కూడిన ఈ కథ ప్రతి ఒక్కరినీ మెప్పిస్తుంది’ అని చెప్పింది అనుపమ పరమేశ్వరన్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘పరదా’ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు. ఆదివారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. చిరంజీవిగారి జన్మదినమైన ఈ నెల 22న సినిమా విడుదల కావడం ఆనందంగా ఉందని తెలిపింది. ఇలాంటి మహిళా ప్రధాన కథలకు ఆదరణ దక్కితే భవిష్యత్తులో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంటుందని దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తెలిపారు.
రెండేళ్ల ప్రయాణమిదని, కంటెంట్‌ను నమ్మి సినిమా చేశామని నిర్మాతలు శ్రీనివాసులు పీవీ, శ్రీధర్, విజయ్ డొంకడ పేర్కొన్నారు. ఈ వేడుకలో చిత్ర ప్రధాన తారాగణం దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్‌తో పాటు యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.