Anupama Parameswaran | సినిమా బండి డైరెక్టర్‌తో అనుపమ పరమేశ్వరన్ సెల్ఫీ.. నయా అప్డేట్ ఏంటో తెలుసా..?
Anupama Parameswaran | మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్గా నటిస్తోన్న టిల్లు 2 (Tillu Square) సినిమా పోస్టర్ విడుదల చేయగా.. నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఈ భామ తాజాగా సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కండ్రెగుల (Praveen Kandregula)తో దిగిన సెల్ఫీ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Anupama Parameswaran | ప్రేమమ్ సినిమాతో మూవీ లవర్స్ మనసు దోచేసింది మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ఈ భామ ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డతో కలిసి టిల్లు 2 (Tillu Square) సినిమాలో నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ పోస్టర్ విడుదల చేయగా.. నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటివరకు యాక్టింగ్, డ్రెస్సింగ్ విషయంలో హద్దులు దాటకుండా హోమ్లీ అండ్ బబ్లీ లుక్‌లో కనిపించిన అనుపమ.. టిల్లు 2 సినిమాకు మాత్రం రూటు మార్చేసినట్టు పోస్టర్‌తో అర్థమవుతోంది.
సిద్దుతో మంచి రొమాంటిక్ మూడ్‌లో ఉన్న స్టిల్‌తో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే ఈ భామ తాజాగా సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కండ్రెగుల (Praveen Kandregula)తో దిగిన సెల్ఫీ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఈ సెల్ఫీ సీక్రెట్ ఏంటో తెలుసా..? అనుపమ తెలుగులో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అనుపమ హ్యాపీ మూడ్‌లో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్‌తో చిల్ అవుట్ మూడ్‌లో దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రవీణ్-అనుపమ కాంబోలో రాబోతున్న సినిమా ఫీ మేల్ సెంట్రిక్ స్టోరీనా..? కాదా..? అనేది రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది.
సినిమా బండికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన విజయ్ దొంకడ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. వికాస్ వశిష్ట ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా బండి మంచి టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. మరి ఈ డైరెక్టర్ అనుపమతో ఎలాంటి సినిమా చేయబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
My next film ❤️after #cinemabandi @anupamahere @VijayDonkada pic.twitter.com/rhCbmRPJvD
— Praveen kandregula (@praveen5D) June 7, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

