పురుషాధిపత్యంపై విసిగిపోయిన ఓ అమ్మాయి ధైర్యంగా తీసుకున్న నిర్ణయమే ప్రధానాంశంగా రూపొందిన చిత్రం ‘పరదా’. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషించారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. శ్రీనివాసులు పి.వి, శ్రీధర్ మక్కువ, విజయ్ డొకడ నిర్మాతలు. ఈ నెల 22న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.
హీరో రామ్ పోతినేని ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. అందర్నీ ఆలోచింపజేసే, ఆనందింపజేసే సినిమా ‘పరదా’ అని కథానాయిక అనుపమ పరమేశ్వరన్ చెప్పారు. ఈ సినిమాలో అనుపమ 2.0ని చూడబోతున్నామని, తను అంత అద్భుతంగా నటించిందని నిర్మాత విజయ్ తెలిపారు. ఇది బిగ్ స్కేల్‌తో తీసిన ప్రాపర్ కమర్షియల్ సినిమా అని, ఈ మంచి ప్రయత్నానికి ఆర్థికంగా కూడా విజయాన్నిస్తే.. ఇలాంటి మంచి కథలు మరిన్ని వస్తాయని దర్శకుడు ఆకాంక్షించారు. మరో నిర్మాత శ్రీధర్ కూడా మాట్లాడారు.