ఆమె మాటలు మార్పుతెచ్చాయి
హీరోయిన్ల మధ్య వృత్తిపరమైన పోటీ సహజం. వ్యక్తిగతంగా కూడా వారిమధ్య ఈర్ష్యాద్వేషాలుంటాయని కొందరు అంటుంటారు. ఈ నేపథ్యంలోనే.. స్నేహబంధాలు కూడా తమలో బలంగా ఉంటాయని నిరూపించిన నాయికలు కూడా కొందరున్నారు. వారిలో అనుపమ పరమేశ్వరన్, సాయిపల్లవి ముందు వరుసలో ఉంటారు.
హీరోయిన్ల మధ్య వృత్తిపరమైన పోటీ సహజం. వ్యక్తిగతంగా కూడా వారిమధ్య ఈర్ష్యాద్వేషాలుంటాయని కొందరు అంటుంటారు. ఈ నేపథ్యంలోనే.. స్నేహబంధాలు కూడా తమలో బలంగా ఉంటాయని నిరూపించిన నాయికలు కూడా కొందరున్నారు. వారిలో అనుపమ పరమేశ్వరన్, సాయిపల్లవి ముందు వరుసలో ఉంటారు. మలయాళం సినిమా ‘ప్రేమమ్’తో వీరిద్దరూ ఒకేసారి సక్సెస్ అందుకున్నారు. అప్పట్నుంచీ వీరి మధ్య బలమైన స్నేహబంధం ఏర్పడిందని చాలామందికి తెలీదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవితో తన అనుబంధాన్ని నెమరువేసుకున్నది అనుపమ పరమేశ్వరన్. ‘తను నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు. నా శ్రేయోభిలాషి కూడా.
కోవిడ్ టైమ్‌లో సాయిపల్లవి మాటలు నాలో ఆత్మైస్థెర్యాన్ని నింపాయి. ఆ టైమ్‌లో అయినవారితో కమ్యూనికేషన్ తెగిపోయి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఆ క్లిష్ట పరిస్థితుల్లో సాయి నాకు అండగా నిలిచింది. నాలో ప్రశాంతత నింపేందుకు తనెంతో శ్రమించింది. ‘మానసిక ఒత్తిడికి సృజనాత్మకతే మందు’ అని తను చెప్పిన మాట నాలో ఎంతో మార్పును తెచ్చింది. నాకు పెయింటింగ్‌ని పరిచయం చేసింది. రంగులతో కాన్వాస్‌పై భావాలను పంచుకుంటూ మనసులోని భారాన్ని తగ్గించుకున్నాను. మనశ్శాంతి కోసం అలవరచుకున్న ఈ అలవాటు నాలో కొత్త నైపుణ్యాన్ని వెలికి తీసింది’ అంటూ చెప్పుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

