Anupama Parameswaran | అనుపమా పరమేశ్వరన్ స్పీడ్ మామూలుగా లేదు. ‘టిల్లూ స్కేర్’తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం షూటింగ్‌ల్లో బిజీబిజీ. ఈ అందాలభామ చేతిలో ప్రస్తుతానికి ఆరు సినిమాలున్నాయి. వచ్చే ఏడాది వరకూ కొత్త సినిమాలకు డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదట. అంత బిజీ ప్రస్తుతం అనుపమ. రీసెంట్గా తన నట ప్రయాణం గురించి ఆసక్తికరంగా మాట్లాడింది అనుపమ..
‘కంఫర్ట్ జోన్లో సినిమాలు చేయడం నాకు అస్సలు నచ్చదు. అలా పనిచేయడం చాలా బోరింగ్. భిన్నమైన సినిమాల ప్రయాణమంటేనే నాకిష్టం. ప్రయోగాత్మకమైన పాత్రలు చేసినప్పుడు కలిగే సంతృప్తి గురించి మాటల్లో చెప్పలేం. నటిగా ఛాలెంజిగ్ రోల్స్‌నే ఎక్కువగా ఇష్టపడతా. సెట్లో డైరెక్టర్ రీటేక్స్ అడిగినప్పుడు నాలో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఎన్ని టేకులైనా విసుగు లేకుండా చేస్తా. ‘బాగా నటించావ్’ అనే పదం కంటే ‘రీటేక్’ అనే పదమే నా చెవులకు ఇంపుగా ఉంటుంది. అలా ఉంటేనే నటనలో మరింత పరిపక్వత పొందగలం’ అంటూ చెప్పుకొచ్చింది అనుపమ.