Anupama Parameswaran | తెలుగు ప్రేక్షకులకు మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’. చిత్రంలో రావు రమేష్ కూతురు వల్లీగా నటించిన అనుపమ పల్లెటూరి గర్ల్ లుక్‌తో ఆకట్టుకున్నారు. అదే ఏడాది నాగచైతన్యతో నటించిన ‘ప్రేమమ్’ లోనూ ఆమె కనిపించి మరోసారి ఫ్యాన్స్‌ను మెప్పించారు. ఈ రెండు చిత్రాల్లోనూ ఆమె సెకండ్ హీరోయిన్గా కనిపించినా, తన పాత్రలకు 100% న్యాయం చేస్తూ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు.అనంతరం శర్వానంద్‌తో కలిసి నటించిన ‘శతమానం భవతి’ ఆమె కెరీర్‌కు మలుపు తిప్పిన చిత్రం. లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది.
ఈ విజయంతో తెలుగు పరిశ్రమలో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. ఆ ఆర్వాత అనుపమ వరుసగా సినిమాల్లో నటిస్తూ, రొమాంటిక్ డ్రామాలు, కామెడీ, థ్రిల్లర్లలో తన పాత్రల ద్వారా వైవిధ్యాన్ని చూపిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. 2023లో విడుదలైన ‘టిల్లూ స్క్వేర్’ అనుపమ కెరీర్లో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్‌ను రాబట్టి, ఆమెకు ‘100 కోట్ల హీరోయిన్’ అనే టైటిల్‌ను తీసుకువచ్చింది. ఇందులో ఆమె స్టైలిష్ లుక్, పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఆమె డిమాండ్ మరింత పెరిగింది. ప్రస్తుతం అనుపమ ‘పరదా’ అనే ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పోస్టు-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ‘పరదా’ సినిమాను ఆగస్టు 22న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. అయితే రీసెంట్గా హైదరాబాద్‌లోని ఐమాక్స్ థియేటర్లో కొందరు మహిళలు పరదా కప్పుకొని హరిహర వీరమల్లు చూసేందుకు వచ్చారు. తమ చీరలని తలకి పరదా మాదిరిగా కప్పుకొని సందడి చేశారు. సినిమా స్టార్ట్ అయ్యాక కూడా తీయలేదు. ఇందుకు సంబంధించిన వీడియోని అనుపమ తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..వచ్చే నెలలో నన్ను మా ఫ్రెండ్స్‌ని కూడా అక్కడ మీరు ఇలా చూడొచ్చు.ఆగస్ట్ 22న పెద్ద స్క్రీన్‌లో చూస్తారు అని కామెంట్ చేసింది. మొత్తానికి సినిమా ప్రమోషన్ స్టైల్ అయితే అదిరిపోయిందని కొందరు కామెంట్ చేస్తున్నారు.