Anupama Parameswaran | టాలెంటెడ్ మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల తమిళ సినిమాల్లో బిజీగా మారింది. ప్రేమమ్ చిత్రంతో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు దశాబ్దం పూర్తి చేసుకున్న అనుపమ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుసగా అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఆమె క్యూట్ లుక్స్, కర్లీ హెయిర్, నేచురల్ చామ్ కు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అయితే అనుపమ నటనతో పాటు పర్సనల్ లైఫ్ గురించి కూడా అభిమానులలో పెద్ద చర్చే నడుస్తోంది. గతంలో అనుపమకి సంబంధించి పలు రిలేషన్షిప్ రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇటీవల మరోసారి అనుపమ ప్రేమ వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్‌తో అనుపమ పీకల్లోతు ప్రేమలో ఉందనే వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. అనుపమ – ధ్రువ్ కలసి నటించిన తాజా తమిళ చిత్రం “బైసన్”, లవ్ అండ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ జంట మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏర్పడిందని, అది రిలేషన్‌షిప్‌గా మారిందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. వీరిద్దరూ తరచూ కలిసి కనిపించడం, షూటింగ్ తర్వాత కూడా వీరు క్లోజ్‌గా మూవ్ అవుతుండడం, వాటికి సంబంధించి బయటకు వచ్చిన ఫోటోలు, వీడియోలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చాయి.
ఇటీవల జరిగిన బైసన్ ప్రమోషన్ ఈవెంట్ లో అనుపమను మీడియా నేరుగా ఈ విషయంపైనే ప్రశ్నించింది. ధ్రువ్‌తో డేటింగ్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై స్పందించాలంటూ అడిగిన ప్రశ్నకు అనుపమ మాత్రం తెలివిగా తప్పించుకుంది. రూమర్‌పై ప్రత్యక్షంగా స్పందించకుండా, ధ్రువ్ నటన, కమిట్మెంట్ను ప్రశంసిస్తూ ఓ డిప్లొమేటిక్ సమాధానం ఇచ్చింది. దీంతో ఆమె మాటల్లో క్లారిటీ లేకపోవడంతో, ఫ్యాన్స్‌లో కొత్తగా చర్చలు మొదలయ్యాయి. ఒకవైపు అభిమానులు “ఇది నిజమే కావొచ్చూ?” అని ఊహించుకుంటుంటే, మరోవైపు “ప్రెస్ ముందే క్లారిటీ ఇవ్వకుండా అనుపమ తప్పించుకోవడం ఏంటి?” అని ఆశ్చర్యపోతున్నారు. అయితే అనుపమకు సంబంధించి ఇది మొదటి రూమర్ కాదు. గతంలో సహనటుడు నిఖిల్ సిద్దార్థ్, క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా వంటి వారితో అనుపమ రిలేషన్లో ఉందనే ప్రచారాలు సాగాయి. కాని అవి పుకార్లుగానే మిగిలిపోయాయి.