Anupama Parameswaran | టీనేజ్లోనే హీరోయిన్గా సినిమాల్లో అడుగుపెట్టి తన సహజమైన అందం, అమాయకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మరోసారి చర్చకు కారణమైంది. ‘ప్రేమమ్’తో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తెలుగులో ‘ఆ ఆ’, ‘శతమానం భవతి’, ‘హలో గురు ప్రేమ కోసమే’, ‘రాక్షసుడు’, ‘కార్తికేయ 2’ వంటి హిట్ సినిమాల ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ప్రముఖుల పేర్లతో ఫేక్ అకౌంట్లు సృష్టించి మోసాలు, దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ జాబితాలో అనుపమ కూడా చేరింది. ఇటీవల ఇన్స్టాగ్రామ్లో ఆమె పేరుతో ఒక నకిలీ అకౌంట్ సృష్టించి, మార్ఫింగ్ ఫోటోలు షేర్ చేస్తూ, ఆమె స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను ట్యాగ్ చేస్తూ అసభ్యకర కంటెంట్ పోస్టు చేయడం కలకలం రేపింది.
దీనిపై స్పందించిన అనుపమ, కేరళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో ఆ అకౌంట్ వెనుక తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల యువతి ఉన్నట్లు బయటపడింది. ఈ విషయాన్ని స్వయంగా అనుపమ ఇన్స్టాగ్రామ్లో వెల్లడించింది. “కొన్ని రోజుల క్రితం నా పేరుతో మార్ఫింగ్ ఫోటోలు, తప్పుడు సమాచారం షేర్ చేస్తున్న ఒక అకౌంట్ కనిపించింది. అదే వ్యక్తి అనేక ఫేక్ అకౌంట్లు సృష్టించి నా మీద ద్వేష ప్రచారం చేసింది. సైబర్ పోలీసుల దర్యాప్తులో ఆమె తమిళనాడుకు చెందిన యువతి అని తెలిసింది. ఆమె వయసును దృష్టిలో ఉంచుకుని, నేను ఆమె గుర్తింపును బయటపెట్టను. కానీ చట్టపరమైన చర్యలు మాత్రం కొనసాగుతాయి. సెలబ్రిటీలకు కూడా సాధారణ పౌరుల్లాగే హక్కులు ఉన్నాయి. ఆన్లైన్ వేధింపులు శిక్షార్హ నేరం,” అని అనుపమ పేర్కొంది.
ఆమె ఈ హ్యూమన్ గెస్టర్పై నెటిజన్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “అనుపమ చూపించిన సహనం, దయ అద్భుతం”, “ఆమె నిజంగా ఒక క్లాస్ యాక్టర్ మాత్రమే కాదు, క్లాస్ హ్యూమన్ కూడా” అంటూ సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ ఊరేస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే, అనుపమ తాజాగా ‘బైసన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకుముందు ‘పరదా’, ‘కిష్కిందపురి’ చిత్రాల్లో నటించి నటిగా తన వైవిధ్యాన్ని నిరూపించుకుంది. పాత్రల్లో నైపుణ్యం, స్క్రీన్ ప్రెజెన్స్, స్వచ్ఛమైన వ్యక్తిత్వం అన్నీ కలగలిపిన అనుపమ, సౌత్ సినీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా తన స్థానం మరింత బలపరుచుకుంటోంది.