SSMB 29 | ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ అంతా ఒకే ఒకదాని గురించి. సూపర్ స్టార్ మహేష్ బాబు,దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ప గురించి కొన్నాళ్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి.. సినిమా మొదలైనప్పటి నుంచి ఎలాంటి అధికారిక అప్డేట్ ఇవ్వని రాజమౌళి ఇప్పుడు నవంబర్లోనే భారీ ఈవెంట్ ప్లాన్ చేయడంతో సినీప్రియుల దృష్టి మొత్తం ఈ ప్రాజెక్ట్‌పై పడింది. ఈ నెల నవంబర్ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ లుక్, అలాగే సినిమాకు సంబంధించిన టైటిల్ రివీల్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇది సాధారణ ఈవెంట్ కాదు, భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్టేజ్‌గా నిలవనుందని సమాచారం. 130 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తుతో ప్రత్యేక ప్లాట్‌ఫామ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే సెటప్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇటీవల పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ పోస్టర్ ఇండస్ట్రీ మొత్తాన్ని కదిలించింది. ఆ పోస్టర్లో కనిపించిన పృథ్వీ రాజ్ లుక్, థీమ్ – సినిమా స్కేల్‌పై భారీ అంచనాలు పెంచేశాయి. రాజమౌళి సినిమా అంటే ఏదీ సాధారణంగా ఉండదు. అందుకే ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్లు కూడా డిఫరెంట్‌గా ప్లాన్ అవుతున్నాయి. సాధారణంగా సినిమాలు పాటలు, ట్రైలర్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో హడావిడి చేస్తే జక్కన్న మాత్రం కేవలం టైటిల్ మరియు ఫస్ట్ లుక్ రిలీజ్‌కే ఒక ప్రత్యేక ఈవెంట్ ప్లాన్ చేయడం కొత్త ప్రయోగంగా మారింది.
ఈ ప్రోగ్రామ్‌ను జియో మరియు హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇది కూడా ఒక రకమైన రికార్డే. ఎందుకంటే ఇప్పటివరకు ఓ సినిమా గ్లింప్స్ రివీల్ ఈవెంట్ లైవ్‌గా ప్రసారం కావడం ఇదే తొలిసారి. సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ షెడ్యూల్లో ఉంది. హీరోయిన్గా నటిస్తున్న ప్రియాంక చోప్రా కూడా హైదరాబాద్ చేరి షూటింగ్లో పాల్గొంటోంది. జక్కన్న రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను “గ్లోబ్ ట్రాటర్ అడ్వెంచర్ డ్రామా”గా చెప్పొచ్చు . అంటే ఇది కేవలం పాన్-ఇండియా కాకుండా పాన్-వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోంది.రాజమౌళి ఈ నెలలో “భారీ సర్ప్రైజ్” ఉంటుందని ముందే చెప్పడంతో ఫ్యాన్స్ ఉత్కంఠ మరింత పెరిగింది. పృథ్వీరాజ్ పోస్టర్ తర్వాత వచ్చిన రూమర్స్, సెటప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈవెంట్ రోజు మహేష్ బాబు ఫస్ట్ లుక్, టైటిల్, గ్లింప్స్ బయటకు రాగానే అది కేవలం ఒక సినిమా అప్డేట్ కాదు, ఇండియన్ సినిమా కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.