Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తొమ్మిదో వారం ఎపిసోడ్లు ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నాయి. ఊహించని విధంగా ఈ వారం హౌజ్‌లో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. మొదట రాము రాథోడ్ భావోద్వేగానికి గురై సెల్ఫ్ ఎలిమినేట్ కాగా, తాజా సమాచారం ప్రకారం రెగ్యూలర్ ఎలిమినేషన్లో శ్రీనివాస సాయి కూడా హౌజ్‌ని వీడినట్టు తెలుస్తోంది. దీంతో తొమ్మిదో వారం బిగ్ బాస్ హౌజ్ డబుల్ ఎలిమినేషన్‌తో హాట్ టాపిక్‌గా మారింది. రాము రాథోడ్ ఈ వారం పూర్తిగా డల్‌గా కనిపించాడు. హోస్ట్ నాగార్జున ఎందుకిలా ఉన్నావని అడగగా, ఫ్యామిలీ గుర్తుకొస్తోందని, అమ్మ జ్ఞాపకాలు వెంటాడుతున్నాయని తెలిపాడు.
నిద్ర పట్టడం లేదని, ఇంట్లో ఉన్న తన ఏడెనిమిది సిబ్లింగ్స్ గురించి ఆలోచిస్తూనే ఉన్నానని చెప్పాడు. కన్నీళ్లతో పాట పాడి తన బాధను బయటపెట్టాడు. నాగార్జున ఎన్నిసార్లు ఆలోచించమన్నా, హౌజ్‌మేట్స్ ఎంతగా అడ్డుకున్నా వినలేదు. చివరికి “ఇక ఇక్కడ ఉండలేను” అంటూ రాము హౌజ్ వీడాడు. వెళ్ళే ముందు హౌజ్‌మేట్స్‌కి, ప్రేక్షకులకు సారీ చెప్పి బయటకు వచ్చాడు. ఇదిలా ఉంటే, రాము రాథోడ్ వెళ్లిన తర్వాత మరో ఎలిమినేషన్ జరగబోతుందన్న టాక్ హౌజ్‌లో మొదలైంది. ఓటింగ్ ప్రకారం రాము తర్వాత లీస్ట్‌లో ఉన్నది శ్రీనివాస సాయి అని సమాచారం. దీంతో నాగార్జున రెగ్యూలర్ ఎలిమినేషన్లో భాగంగా ఆయనను హౌజ్ నుండి పంపించారని తెలుస్తోంది. ఇలా తొమ్మిదో వారం మొదటిసారి డబుల్ ఎలిమినేషన్ జరిగిందని చెప్పొచ్చు. ఈ ట్రెండ్ ఇకపై కొనసాగవచ్చని కూడా సమాచారం.
సెప్టెంబర్ 7న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 9లో మొత్తం 15 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఇప్పటి వరకు శ్రష్టి వర్మ, ప్రియా, ఫ్లోరా, హరిత హరీష్, మర్యాద మనీష్, భరణి, రమ్య మోక్ష, దివ్వెల మాధురి, శ్రీజ ఎలిమినేట్ అయ్యారు. ఆయేషా జీనత్ అనారోగ్య కారణాలతో స్వచ్ఛందంగా హౌజ్ నుంచి బయటకు వెళ్లింది. తాజాగా రాము రాథోడ్, శ్రీనివాస సాయి కూడా ఎలిమినేట్ కావడంతో హౌజ్‌లో మిగిలింది 10 మంది మాత్రమే. ప్రస్తుతం హౌజ్‌లో సంజనా, రీతూ చౌదరీ, తనూజ, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్, కళ్యాణ్, నిఖిల్, దివ్య, గౌరవ్, భరణి ఉన్నారు. ఈ వారం శ్రీనివాస సాయి ఔట్ కావడంతో టాప్ 10 ఫేజ్ మొదలైంది. షో ముగియడానికి ఇంకా ఆరు వారాలు మాత్రమే ఉండటంతో టాప్ 5లోకి ఎవరు వెళ్తారనేది ఇప్పుడు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది.