Shefali Verma : ప్రపంచ కప్ ఛాంపియన్లకు స్వరాష్ట్రంలో, సొంత ఇలాకాలో ఘన స్వాగతం లభిస్తోంది. విశ్వ విజేతగా తిరిగి వచ్చిన భారత క్రికెటర్లకు అడుగడుగున జనాలు నీరాజనం పడుతున్నారు. తాజాగా ఓపెనర్ షఫాలీ వర్మ (Shefali Verma)కు సొంత ఊర్లో అపూర్వ స్వాగతం లభించింది. ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో జట్టు విజయంలో భాగమైన ఆమెను రాష్ట్ర మంత్రి క్రిష్ణ కుమార్ బేడీ (Krishna Kumar Bedi), స్థానికులు గొప్పగా ఆహ్వానించారు. యాభై రూపాయల నోట్ల కట్టల దండతో పాటు తలపాగా చుట్టి షఫాలీని స్వాగతించారు.
నలభై ఏళ్లుగా ఊరిస్తున్న వన్డే వరల్డ్ కప్‌ను భారత జట్టు గెలుపొందడంలో షఫాలీ వర్మ కీలక పాత్ర పోషించింది. ఫైనల్లో మెరుపు అర్ధ శతకం, బంతితో రెండు వికెట్లతో టీమిండియా కలను సాకారం చేసిందీ డాషింగ్ ఓపెనర్. వరల్డ్ కప్ క్వీన్‌గా ప్రధాని మోడీ, ఆపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకున్న షఫాలీ ఆదివారం తన స్వగ్రామమైన రోహతక్‌కు వెళ్లింది. ఆమెకు పూలదండలు, బొకేలు ఇచ్చి అభినందనలు తెలిపిన స్థానికులు.. ఆపై జీపులో ఊరేగించారు. వరల్డ్ కప్ ప్రదర్శనతో తమ ప్రాంతం పేరు మార్మోగేలా చేసినందుకు ప్రశంసలు కురిపించారంతా. అంతేకాదు బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు స్థానికులు.
A warm welcome for World Champion Shafali Verma as she returns to Rohtak! 🏆💙#CWC25 #ShafaliVerma #Sportskeeda pic.twitter.com/TiabcxvZWY
— Sportskeeda (@Sportskeeda) November 9, 2025
వన్డే వరల్డ్ కప్‌లోకి అనుకోకుండా అడుగుపెట్టిన షఫాలీ వర్మ మ్యాచ్ విన్నర్‌గా అవతరించింది. సెమీఫైనల్లో నిరాశపరిచిన లేడీ సెహ్వాగ్ ఫైనల్లో మాత్రం టాప్ గేర్‌లో ఆడింది. దక్షిణాఫ్రికా బౌలర్లపై ఎదురుదాడి చేసిన షఫాలీ 87 పరుగులతో శభారంభమిచ్చింది. అనంతరం బౌలింగ్‌లోనూ సత్తా చాటిన తను కీలక వికెట్లు తీసింది. పార్ట్ టైమ్ బౌలర్‌గా బంతి అందుకున్న షఫాలీ మొదటి ఓవర్లోనే రిటర్న్ క్యాచ్‌తో సునే లుస్ను వెనక్కి పంపింది.
What a bowling change 😍
Shafali Verma now has a #CWC25 wicket to her name 🥳
Updates ▶ https://t.co/TIbbeE4ViO#TeamIndia | #WomenInBlue | #INDvSA | #Final | @TheShafaliVerma pic.twitter.com/Sz8WaWfasR
— BCCI Women (@BCCIWomen) November 2, 2025
ఆ తర్వాత సఫారీలకు మరో షాకిస్తూ డేంజరస్ మరిజానే కాప్‌ను సన్నాకే పెవిలియన్ పంపింది తను. ఆ తర్వాత మరో వికెట్ తీయకపోయినా ఫామ్‌లో ఉన్న లారా వొల్వార్డ్త్ను పెద్ద షాట్లు ఆడకుండా కట్టడి చేసింది షఫాలీ. ఫైనల్లో సంచలన బౌలింగ్‌తో టీమిండియా విజయంలో కీలకమైన ఈ 21ఏళ్ల యువకెరటం ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికైంది.