Paradha | ప్రేమమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran). ముంగురులు తిరిగిన జుట్టుతో కుర్రకారు మనసు దోచేసే ఈ భామ తెలుగులో చివరగా టిల్లు స్వ్కేర్ సినిమాలో కనిపించింది.
అనుపమ ఆ తర్వాత తమిళ, మలయాళ సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటిస్తున్న తెలుగు చిత్రం ‘పరదా’(Paradha). మలయాళ నటి దర్శన, సంగీత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా బండి ఫేం ప్రవీణ్ కాండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టు 22న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషనల్ టూర్స్‌తో బిజీగా ఉంది అనుపమ టీం. నేడు పరదా ప్రమోషన్స్‌లో భాగంగా ఏలూరులోని రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించింది. అనుపమ పరమేశ్వరన్ ఈ సందర్భంగా రెడ్ డ్రెస్‌లో కుందనపు బొమ్మలా మెరిసింది. స్టేజ్‌పై నుంచి అందరికీ హాయ్ చెబుతూ.. విద్యార్థులతో కలిసి సెల్ఫీలు దిగింది. చిరునవ్వుతో కట్టిపడేస్తున్న అనుపమ పరమేశ్వరన్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Team #Paradha received a warm welcome and an overwhelming response during their visit to Ramachandra Engineering College, Eluru 🤩✨
Releasing in cinemas worldwide from AUG 22nd. 💕@anupamahere @darshanarajend @sangithakrish @AnandaMediaOffl @praveenfilms @VijayDonkada… pic.twitter.com/VwQ5vBlXwj
— BA Raju’s Team (@baraju_SuperHit) August 12, 2025
Param Sundari Trailer | జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’ ట్రైలర్ చూశారా.!
Coolie Movie | రజినీకాంత్ ‘కూలీ’ క్రేజ్: ఉద్యోగులకు పెయిడ్ హాలిడే ప్రకటించిన సింగపూర్ కంపెనీ
Coolie Pre Sales | రజనీ మేనియా.. విడుదలకు ముందే ‘కూలీ’ రికార్డు