అందానికే అసూయపుట్టే సొగసు ఆ భామ సొంతం. పొడవాటి ముంగురులతో, మంత్రముగ్దుల్ని చేసే ఓర చూపుతో ఆకట్టుకోవడం ఆ కేరళ సోయగం స్పెషాలిటీ. ప్రేమమ్ సినిమాతో దక్షిణాది ప్రేక్షకుల మనసు దోచేసింది అనుపమపరమేశ్వరన్ (Anupama Parameshwaran). ఈ అందాల తార ఓ వైపు సినిమాలతో అలరిస్తూనే..మరోవైపు నెట్టింట్లో ఏదో ఒక స్టిల్ తో సందడి చేస్తుంటుంది.
తాజాగా ట్రెడిషనల్ గ్లామర్ షో చేసింది అనుపమ్ పరమేశ్వరన్. ప్రకాశవంతమైన కళ్లు, కరెంట్ పాసయ్యేలా ఉన్న నవ్వుతో మిలియన్ల సంఖ్యలో హృదయాల్లో అలజడి సృష్టిస్తోంది అనుపమ. అనుపమ ఓనమ్ శారీ (onam saree) , ఫ్లోరల్ బ్లౌజ్ లో, నుదుటన ఎర్రటి సింధూరంతో వయ్యారాలు ఒలకబోస్తున్న స్టిల్ ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. చేతికి రంగురంగుల గాజులు పెట్టుకున్న ఈ కేరళ కుట్టి వాటిని చూపిస్తూ డిఫరెంట్ స్టైల్ లో కెమెరాకు ఫోజులిచ్చింది.
ఈ బ్యూటీ ప్రస్తుతం నిఖిల్ తో కలిసి తెలుగులో 18 పేజెస్ సినిమా చేస్తోంది. మరోవైపు తమిళంలో ఓ సినిమాలో నటిస్తోంది.
ఇవికూడా చదవండి..
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!