Prabhas Fauji | అగ్ర కథానాయకుడు ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండగా.. ఈ సినిమాలో హీరోయిన్గా ఇమాన్ ఎస్మాయిల్ నటిస్తుంది. ఇదిలావుంటే ఈ చిత్రంలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ మూవీ షూటింగ్లో పాల్గోన్న అనుపమ్ ఖేర్ సెట్స్ నుంచి ప్రభాస్‌తో దిగిన ఫొటోలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. నా 544వ సినిమా ఇండియన్ సినిమాకు బాహుబలి అయిన ప్రభాస్ తో చేస్తున్నాను. ఈ సినిమాకు టాలెంటెడ్ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అలాగే నా స్నేహితుడు బ్రిలియంట్ కెమెరామెన్ సుదీప్ ఛటర్జీ ఈ సినిమాకు డీవోపీగా చేస్తున్నాడు. ఇది ఒక అద్భుతమైన కథ. జీవితంలో ఇంకేం కావాలి అంటూ అనుపమ్ ఖేర్ రాసుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది.
ANNOUNCEMENT: Delighted to announce my 544th untitled film with the #Bahubali of #IndianCinema, the one and only #Prabhas ! The film is directed by the very talented @hanurpudi ! And produced by wonderful team of producers of @MythriOfficial ! My very dear friend and brilliant… pic.twitter.com/sBIXCS98t6
— Anupam Kher (@AnupamPKher) February 13, 2025
ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నట్లు సమాచారం. అందుకే ఈ మూవీ టైటిల్ ‘ఫౌజీ’ అయితే బావుంటుందని బృందం భావిస్తున్నది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో రానుండగా బ్రిటీష్‌వారి సైనికుడిగా ఇందులో ప్రభాస్ కనిపించనున్నారట. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు బాణీలు సమకూరుస్తున్నారు.