బాలీవుడ్ నట దిగ్గజం అనుపమ్ఖేర్కి రీసెంట్గా అనుకోని చిక్కు వచ్చిపడింది. 70ఏండ్ల వయసులో గోడ దూకి షూటింగ్‌కి అటెండ్ కావాల్సిన పరిస్థితి తలెత్తిందాయనకు. ఈ విషయం గురించి అనుపమ్‌ఖేర్ తన సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న ‘ది రాజాసాబ్’ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను. షూటింగ్ లొకేషన్‌కి కారులో బయల్దేరాను.
డ్రైవర్ ఓ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి కారు ఆపేశాడు. అక్కడ్నుంచి ముందుకెళ్లడానికి కానీ, వెనక్కి రావడానికి కానీ లేదు. షూటింగ్ జరుగుతున్న ప్రాంతం పక్కనే అవ్వడంతో గోడ దూకి సెట్‌కి వెళ్లాను. నా 40ఏండ్ల కెరీర్లో ఎన్నో షూటింగ్ లొకేషన్లకు వెళ్లాను. కానీ గోడ దూకి వెళ్లింది మాత్రం ‘ది రాజాసాబ్’ కోసమే. ఇదో కొత్త అనుభవం. తలచుకుంటే కామెడీగా ఉంది.’ అంటూ స్పందించారు అనుపమ్‌ఖేర్.