Jawan Prerelease event | బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘జవాన్’ (Jawan). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వం వహిస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. జవాన్ సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నేడు చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కింగ్ ఖాన్ షారుఖ్ తన టీమ్‌తో కలిసి ఈవెంట్‌కు హాజరయ్యాడు. అతిపెద్ద సినిమా జవాన్‌కు పనిచేసిన సాంకేతిక నిపుణులు షారుఖ్ ఖాన్ గొప్పతనం గురించి ప్రస్తావిస్తూ.. ఆయనపై ప్రశంసలు కురిపించారు.
ఈవెంట్లో ఎడిటర్ ఆంటోనీ రూబెన్ (Antony Ruben)మాట్లాడుతూ.. సినిమాలో ల్యాగ్ (సాగదీత) ఏమైనా ఉందా..? అని షారూఖ్‌ను అడిగాను. కొన్ని సన్నివేశాల్లో నిడివి విషయంలో సమస్యలు వస్తే ఇతర నటీనటులకు బదులు తన పోర్షన్లను తనకు చెప్పాడని రూబెన్ అన్నాడు. ఆ తర్వాత ఆర్ట్ డైరెక్టర్ ముత్తురాజ్ తమకు చెన్నైలో సుదీర్ఘ షెడ్యూల్ ఉందని చెప్పారు. షారుఖ్ ఖాన్ కావాలనుకుంటే ముంబైలోనే సినిమా మొత్తం తీయొచ్చని, అయితే ఇక్కడికి రావడం వల్ల 3000 కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన చెన్నైని ఎంచుకున్నారు. ఈ లక్షణాలే షారుఖ్‌ఖాన్‌ను దేశంలోని అత్యంత ఇష్టపడే యాక్టర్లగా ఒకరిగా నిలబెట్టాయన్నారు.
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట టీజర్‌తోపాటు Jawan Prevue సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలలో నటిస్తుండగా.. బాలీవుడ్ భామ దీపికా పదుకొనే అతిథి పాత్రలో కనిపించనుంది. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీని షారుఖ్ ఖాన్ హోంబ్యానర్ రెడీ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై గౌరీఖాన్ తెరకెక్కిస్తోంది.
#Jawan #JawanInChennai https://t.co/1VbQxGezLG
— Red Chillies Entertainment (@RedChilliesEnt) August 30, 2023
జవాన్ టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ ..
Jawan Prevue..