Nari Nari Naduma Murari | టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand) నటించిన లేటెస్ట్ ప్రాజెక్ట్ నారీ నారీ నడుమ మురారి (Nari Nari Naduma Murari).సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్, ఏజెంట్ ఫేం సాక్షి వైద్య ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.
పండుగ మొదలయింది అంటూ మేకర్స్ మరో క్రేజీ వార్తను షేర్ చేశారు. అద్భుతమైన ఓపెనింగ్ వీక్ తర్వాత ప్రేక్షకులను వస్తున్న డిమాండ్ నేపథ్యంలో మరిన్ని థియేటర్లతో మీ ముందుకు వస్తోంది అంటూ కొత్త లుక్ విడుదల చేశారు. ఇంకేంటి మరి సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ఈ చిత్రంపై మీరూ ఓ లుక్కేయండి. ఈ సంక్రాంతికి అసలైన పండుగ ఆఫర్.. ఎంఆర్పీ ధరలకే టికెట్లు.. అదనపు ఛార్జీలు ఏం లేవు.. అంటూ శర్వానంద్ టీం ప్రమోషనల్ స్ట్రాటజీ పర్ఫెక్ట్గా వర్కవుట్ అయినట్టు ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ చెప్పకనే చెబుతున్నాయి.
ఆటోడ్రైవరైన కమెడియన్ సత్య ఓ మహిళను ఆస్పత్రికి తీసుకొచ్చిజాగ్రత్త దింపేసి వెళ్లే క్రమంలో.. ఆ మహిళ డబ్బులు తీసుకో బాబు అని అంటే.. అయ్యో వద్దమ్మా గర్బిణీ స్త్రీల దగ్గర డబ్బులు తీసుకోనమ్మా సత్య అంటాడు. నేను ప్రెగ్నెంట్ కాదు అని ఆ మహిళ అనే ఫన్నీ సన్నివేశంతో షురూ అయింది ట్రైలర్. ఆ తర్వాత బీటెక్ చదివి ఆర్కిటెక్ట్‌గా పనిచేసే క్రమంలో శర్వానంద్‌కు సంయుక్తా మీనన్, సాక్షి వైద్య కలుస్తారు.
ఇద్దరి మధ్య ఎలా నలిగిపోతాడనే నేపథ్యంలో ఎంటర్టైనింగ్గా సాగే ఈ సినిమాను మూవీ లవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ ప్రాజెక్ట్‌ను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కించారు.
పండుగ మళ్లీ మొదలయ్యింది… 🤩💥
On public demand, #NariNariNadumaMurari expands with increased theaters following a phenomenal opening week! 😎Watch The ultimate SANKRANTHI WINNER at your FAVOURITE THEATRES 🎟️🔥#SharwaSankranthi #BommaBlockbuster
Charming Star @ImSharwanand… pic.twitter.com/zzHmyMUr9t
— BA Raju’s Team (@baraju_SuperHit) January 19, 2026
Anti Biotics | యాంటీ బయోటిక్స్ వాడితే.. పేగుల ఆరోగ్యాన్ని ఇలా రక్షించుకోండి..!
Mirai | టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైన బ్లాక్‌బస్టర్ ‘మిరాయ్’… ఈ నెలలోనే స్టార్ మా లో సందడి
Bhadradri Kothagudem : ‘గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు’