Annapurna studios | ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు ఏ రేంజ్లో పెరిగిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఉన్నత చదువులు చదువుకున్న వాళ్లు కూడా కొన్ని సందర్భాలలో సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన కూడా వీరి ఆగడాలు ఆగడం లేదు. అన్ని రంగాలపై సైబర్ నేరగాళ్లు దృష్టి పెట్టగా, సినిమా ఇండస్ట్రీలో సైబర్ మోసాల తరహాలో అనేక మోసాలు జరుగుతూ ఉంటాయి. ఫలానా వారి పేరు చెప్పి అవకాశాలు ఇస్తామని చెప్పి లక్షలు లక్షలు దోచుకుంటున్నారు. ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ఇలాంటి విషయాలలో అప్రమత్తం చేస్తున్న కూడా ఏదో ఒక చోట కేటుగాళ్లు మోసాలు చేస్తూనే ఉన్నారు.
ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పేరును ఉపయోగించుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారట. తమకు అన్నపూర్ణ స్టూడియోలో తెలిసిన వారు ఉన్నారు. అక్కడ జరిగే సినిమా షూటింగ్స్‌కి, సీరియల్ షూటింగ్స్‌కి మిమ్మల్ని తీసుకు వెళతాం. అక్కడ నటించే అవకాశం ఇప్పిస్తామని నటీ నటులను, సాంకేతిక నిపుణులను సైతం కొందరు మోసం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో తమ పేరిట బయట జరుగతున్న మోసపూరిత ప్రక్రియలపై వారు స్పందించారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో పని చేసేందుకు జాబ్ ఆఫర్స్ అంటూ కొన్ని ఫేక్ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి . వాటిని ఎవరు నమ్మోద్దని తెలియజెప్పారు.
నటీనటులు, టెక్నీషియన్స్ గా తీసుకుంటామని మా పేరిట కొందరు తప్పుడు ఆఫర్స్ ఇస్తున్నారు . దీనిపై అందరు దృష్టి పెట్టాలి. అన్నపూర్ణ స్టూడియోస్ ఎప్పుడూ ఎవరి దగ్గరా డబ్బులు ఛార్జ్ చేయదు. ఆడిషన్స్ అయినా మరే ఇతర అంశాల్లో అయినా కూడా తాము డబ్బులు తీసుకోము. ఎవరికైనా మా పేరుతో తప్పుడు సంప్రదింపులు వస్తే మా మెయిల్ ద్వారా తమని రీచ్ అవ్వొచ్చని వారు సూచించారు.