Anna Lezhneva | మెగా ఫ్యామిలీకి కోడలిగా, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భార్యగా గుర్తింపు పొందిన అన్నా లెజినోవా ఇటీవల సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి రెగ్యులర్‌గా పోస్టులు చేస్తూ మెగా ఫ్యాన్స్‌కు దగ్గరవుతోంది. మెగా కుటుంబానికి సంబంధించిన ఫోటోలు, వ్యక్తిగత అనుభవాలు షేర్ చేస్తూ ఆమె మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. దీంతో మెగా అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు కూడా ఆమెను పెద్ద ఎత్తున ఫాలో అవుతున్నారు.
తాజాగా అన్నా లెజినోవా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫాలోవర్స్‌తో సరదాగా చిట్‌చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె ఓపెన్‌గా సమాధానాలు ఇచ్చింది. వంట చేయగలరా అని ఒకరు అడగగా, “మా అత్తమ్మ దగ్గరనే నేను చాలా వంటలు నేర్చుకున్నాను. దోస, ఇడ్లీ, చట్నీ, కర్రీలు, పప్పులు, ఫిష్ పులుసు, గోంగూర, పాలక్ పన్నీర్, ప్రాన్స్ ఇగురు, బిర్యానీ వంటి ఎన్నో వంటకాలు చేయడం నేర్చుకున్నాను. ముఖ్యంగా వెజ్ వంటలు ఎక్కువగా నేర్చుకున్నాను” అని తెలిపింది.
అలాగే మరో అభిమాని పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన ఆహారం ఏమిటి అని ప్రశ్నించగా, ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చింది. మా అత్తమ్మ చేసే మసాలా చికెన్ కర్రీ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ వంటను నేను కూడా ఆమె దగ్గర నుంచి నేర్చుకున్నాను. అలాగే ఆయన వదినమ్మ సురేఖ చేసే చేపల పులుసు కూడా చాలా ఇష్టంగా తింటారు” అని వెల్లడించింది. ఇలా వ్యక్తిగత విషయాలను సరదాగా పంచుకుంటూ అన్నా లెజినోవా అభిమానులకి మరింత దగ్గరవుతోంది. ఆమె చేసే ప్రతి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, మెగా ఫ్యాన్స్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఇలా పవన్ కళ్యాణ్ కుటుంబానికి సంబంధించిన ఇలాంటి చిన్న చిన్న విషయాలను బయటపెడుతూ అన్నా లెజినోవా సోషల్ మీడియాలో తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంటోంది.