Anna Antene Full Video Song | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కింగ్డమ్. భాగ్య శ్రీ బోర్సే (Bhagyashri Borse) కథానాయికగా నటించగా.. సత్యదేవ్ (Satya Dev) కీలక పాత్రలో నటించాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఎమోషనల్ సాంగ్ అన్నా అంటేనే (Anna Antene) పాట ఫుల్ వీడియోను విడుదల చేశారు.
అన్నా అంటేనే.. ఉన్నానంటూనే అంటూ తన సోదరుడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్గా సాగింది ఈ పాట. ఈ పాటను కృష్ణకాంత్ రచించగా, అనిరుధ్ స్వరపరిచి స్వయంగా ఆలపించారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అన్నదమ్ములుగా నటించారు. ఆ ఇద్దరి నేపథ్యంలో సాగే పాటే ఇది.