Beauty Trailer | అంకిత్ కొయ్య, నీలఖి కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ బ్యూటీ (Beauty). జేఎస్ఎస్ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి జేఎస్ఎస్ వర్ధన్ డైలాగ్స్ కూడా అందిస్తున్నాడు. బ్యూటీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్లతోపాటు టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య లాంచ్ చేశాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్రైలర్‌ను ట్వీట్ చేశాడు చైతూ.
ఎప్పుడన్నా నేను నిన్ను కోప్పడితే నన్నలా వదిలిపెట్టి వెళ్లిపోకు అని అంకిత్ అంటుండగా.. నిన్ను వదిలేయడమంటే ఊపిరి వదిలేయడమే కన్నా అంటోంది హీరోయిన్ నీలఖి. ఈ ఆటో వెనుకాల కొటేషన్లు రాస్తుంటారు కదా.. అవన్నీ నీ ఐడియాలే కదా.. అంటూ అంకిత్ ఆటపట్టిస్తూ అడిగే డైలాగ్స్‌తో మొదలై.. హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్.. తండ్రీ కూతుళ్ల రిలేషన్.. ప్రేమకథలో మలుపులు వంటి అంశాల చుట్టూ సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్ చెబుతోంది. అందరికీ ఉంటారు కూతుళ్లు.. కానీ ఇలా నెత్తిమీద పెట్టుకుని చూసేవాళ్లు మాత్రం మీరే ఉంటారంటున్న డైలాగ్స్ తండ్రీకూతుళ్లకు బాగా కనెక్ట్ అవడం గ్యారంటీ అని చెబుతున్నాయి.
ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ కీ రోల్లో నటిస్తున్నాడు. ‘కూతురు అడిగింది కొనిచ్చేటప్పుడు వచ్చే కిక్కు ఓ మధ్య తరగతి తండ్రికే తెలుస్తుంది.. తన కోసం కొంచెం కష్టపడాలి.. పడతాను..’అంటూ ఇప్పటికే కట్ చేసిన టీజర్లో తండ్రి తన కూతురు కోసం చెబుతున్న ఎమోషనల్ డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ మూవీకి విజయ్ బల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు. బ్యూటీ సెప్టెంబర్ 19న విడుదల కానుంది.
బ్యూటీ ట్రైలర్..
Happy to launch the trailer of Beauty! A film meant to be experienced on the big screen with your families. Releasing in theatres this September 19th…
My Best wishes to the team.
Presenting the #BeautyTrailer https://t.co/cXLgNr06Em#Beauty @DirectorMaruthi @AnkithKoyyaLive… pic.twitter.com/I34IW80IpV
— chaitanya akkineni (@chay_akkineni) September 13, 2025