తెలుగమ్మాయి అంజలి చెప్పలేనంత ఆనందంగా ఉంది. దానికి కారణం ‘గేమ్‌చేంజర్’. రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు భార్యగా, తల్లిగా రెండు షేడ్స్‌లో ఆమె కనిపించనుంది. రీసెంట్గా ఈ సినిమా గురించి ఆమె ఓ తమిళ మీడియాతో మాట్లాడింది. ‘కొన్ని సినిమాలు డబ్బుకోసం చేస్తాం. కొన్ని సినిమాలు ఆత్మసంతృప్తికోసం చేస్తాం. నాకు రెండు విధాలా ఆనందాన్ని పంచిన సినిమా ‘గేమ్ చేంజర్’.
నాతోపాటు కైరా అద్వానీ కూడా ఇందులో హీరోయిన్గా నటించినా.. నా పాత్ర మాత్రం ఈ సినిమాలో ప్రత్యేకం. సినిమా చూసి బయటకొచ్చే ప్రేక్షకులకు రామ్‌చరణ్ తర్వాత నేనే గుర్తుంటా. నా కేరక్టర్ గొప్పతనం అలాంటిది. నా కెరీర్లోనే ఇది బెస్ట్ కేరక్టర్ అని నమ్మకంగా చెప్పగలను. ఓ విధంగా నేను ఛాలెంజ్‌గా తీసుకొని చేసిన పాత్ర ఇది. ఓ రామ్‌చరణ్‌కి భార్యగా, మరో రామ్‌చరణ్‌కు తల్లిగా నటించడం ఓ గొప్ప అనుభవం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి పాత్రలు దొరకడం అరుదు. నా పాత్రలో అద్భుతమైన ట్విస్ట్ ఉంటుంది. అది తెరపై చూస్తేనే తెలుస్తుంది.’ అంటూ చెప్పుకొచ్చింది అంజలి.