పాత్రల ఎంపికలో వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తుంది కథానాయిక అంజలి. గత కొన్నేళ్లుగా ఛాలెంజింగ్ రోల్స్ ఎంచుకుంటూ సత్తా చాటుతున్నది. విశ్వక్సేన్ కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్స్ రూపొందిస్తున్న తాజా చిత్రంలో అంజలి కీలక పాత్రలో నటిస్తున్నది. ఈ సినిమాకు కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం అంజలి జన్మదినం సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రత్నమాల అనే పాత్రలో కనిపించనుంది అంజలి.
‘రత్నమాల తన వెనక దాచుకున్న రహస్యమేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశ్వక్సేన్ క్రూరమైన పాత్రలో కనిపిస్తారు. ఆయన పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: అనిత్ మదాది, సంగీతం: యువన్‌శంకర్ రాజా, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య, దర్శకత్వం: కృష్ణచైతన్య.