madha gaja raja ‘అన్నిరకాల వాణిజ్య హంగులు కలబోసిన సినిమా ఇది. నా క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. విశాల్ నాకు మంచి మిత్రుడు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. తమిళంలో పెద్ద విజయం సాధించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం’ ఉంది అని చెప్పింది అంజలి. ఆమె కథానాయికగా విశాల్ సరసన నటించిన తమిళ చిత్రం ‘మదగజ రాజా’.
సుందర్ సి దర్శకుడు. ఈ చిత్రాన్ని సత్యకృష్ణ ప్రొడక్షన్స్ ఈ నెల 31న తెలుగులో విడుదల చేస్తున్నది. వరలక్ష్మి శరత్‌కుమార్ మరో నాయికగా నటించింది. సోమవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్‌కుమార్ మాట్లాడుతూ ‘నాయికగా నా తొలి కమర్షియల్ సినిమా ఇది.
విశాల్ యాక్షన్, సంతానం కామెడీ హైలైట్‌గా నిలుస్తాయి. నాన్‌స్టాప్ ఎంటర్టైనర్గా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అని తెలిపింది. తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్ అయిందని, ఇక్కడ కూడా అదే ఫలితం వస్తుందన్న నమ్మకంతో ఉన్నామని నిర్మాత జెమిని కిరణ్ తెలిపారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోని సంగీతాన్నందించారు.