Anjali | ‘ ‘గేమ్ చేంజర్’లో నా పాత్ర పేరు పార్వతి. విశేషమేంటంటే.. మా అమ్మ పేరు కూడా పార్వతే. శంకర్‌గారు ఈ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు మా అమ్మే గుర్తొచ్చింది. ఈ పాత్ర నుంచి నుంచి చాలా కోరుకుంది. అదే స్థాయిలో నటించానని అనుకుంటున్నా. నటిగా ఇది నా కెరీర్లోనే బెస్ట్ సినిమా.’ అని నటి అంజలి అన్నారు. రామ్‌చరణ్ కథానాయకుడిగా, శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ‘గేమ్ చేంజర్’ సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్ అంజలి. సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఆమె విలేకరులతో ముచ్చటించింది. ‘ఈ పాత్ర గురించి నేను ఎక్కువగా చెప్పకూడదు. కథకు, ఈ పాత్రకూ ఉన్న బంధం అలాంటిది. పార్వతిగా నా నటన చూసి శంకర్‌గారు చాలా చోట్ల మెచ్చుకున్నారు. లొకేషన్ నుంచి ఇంటికొచ్చాక కూడా ఈ పాత్ర నన్ను వెంటాడుతూనే ఉండేది. విడుదలకు ముందే ఇందులోని నా పాత్రకు నేషనల్ అవార్డు వస్తుందని చాలామంది అంటున్నారు. అదే నిజమైతే అంతకంటే ఆనందం ఏముంటుంది.’ అని పేర్కొన్నారు అంజలి.
ఈ సినిమా నేపథ్యం, ఈ పాత్ర నాకు కొత్త. అందుకే నటించేదుకు కష్టపడాల్సొచ్చింది. తెరపై పార్వతిగా నన్ను చూసి ఆడియన్స్ థ్రిల్ ఫీలవుతారు. అప్పన్న, పార్వతి పేమబంధం గొప్పగా ఉంటుంది.’ అని తెలిపింది అంజలి. చిరంజీవి సినిమా చూసి తన పాత్రను మెచ్చుకున్నారని తెలిసి చెప్పలేని ఆనందం కలిగిందని, రామ్‌చరణ్‌తో వర్క్ చేయడం అద్భుతమైన అనుభవమని అంజలి ఆనందం
వెలిబుచ్చింది.