Animal Movie | బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘యానిమల్’(Animal). ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మంధాన (Rashmika Mandana) హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు మ్యూజికల్ అప్డేట్ ఇవ్వగా సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచారు. ముఖ్యంగా తెలుగులో భారీ ఎత్తున ప్రమోషన్లు చేస్తున్నారు. ‘యానిమల్’ తెలుగు ప్రమోషన్స్‌లో భాగంగా సందీప్ రెడ్డి వంగా, రష్మికలతో పాటు రణ్‌బీర్ కపూర్ లు బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు (Unstoppable With NBK) రానున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించి పోస్టర్లు విడుదల చేయగా.. బాలయ్య, రణబీర్ కపూర్, రష్మిక కలిసి ఉన్న పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ షో నుంచి ‘యానిమల్’ ఎపిసోడ్‌కు సంబంధించి మేకర్స్ ప్రోమో విడుదల చేశారు. వైల్డెస్ట్ ఎపిసోడ్ అంటూ ఉన్న ఈ ప్రోమో చూస్తే.. ”ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందు కాదు”. ”డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ది ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ”. అంటూ రణబీర్ కపూర్ బాలయ్య డైలాగ్స్‌తో అలరించాడు. మరోవైపు ఈ ప్రోమలో రష్మిక మంధాన విజయ్ దేవరకొండకు ఫోన్ చేయగా హయ్ బేబ్ అంటూ అనడం వీడియోకు హైలెట్‌గా నిలిచింది.
ఈ అన్‌స్టాపబుల్ పాన్ ఇండియా ఎపిసోడ్‌ను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది.
🦁#UnstoppableWithNBK Wildest episode is gonna be
🅺ickass
🅲RUSHing( read KRUSH❤️)
🅟owerful
🅳ominating
🗓️Mark your calendars for the Wildest Entertainment Feast… Nov 24 it is🔥
Promo here :https://t.co/kNYQHlB897#NandamuriBalakrishna #RashmikaMandanna #RanbirKapoor…— ahavideoin (@ahavideoIN) November 18, 2023