Animal Movie RGV Review | బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’(Animal) మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. మొదటిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజు కూడా అదే ఫామ్ కొనసాగిస్తుంది. ఈ సినిమా రెండో రోజు ఏకంగా రూ.236 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా (Sandeep reddy Vanga) దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాను తాజాగా చూసిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ యానిమల్‌పై రివ్యూ ఇచ్చాడు.
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ”యానిమల్ సినిమా మీద రాసిన రివ్యూలు చూసి, చదివిన తర్వాతే నేను సినిమాకి వెళ్ళాను .. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి సినిమాలు తీసిన తర్వాత నేను కేవలం ఒక ప్రేక్షకుడిగా మాత్రమే ఏ సినిమానీ చూడలేను … అందుకే ఈ సినిమాని వేరు వేరు కోణాల్లో చూడాలి అని డిసైడ్ అయ్యి వెళ్ళాను అంటూ రామ్ గోపాల్ వర్మ చెప్పుకోచ్చాడు.
నైన్ అండ్ హాఫ్ వీక్స్, ఫ్యాటల్ అట్రాక్షన్, లోలిట, లాంటి క్లాసిక్ సినిమాలు తీసిన ఇంగ్లీష్ ఫిల్మ్ మేకర్ యాడ్రియన్ లిన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా అన్నది ప్రేక్షకుడికి నచ్చిందా, నచ్చలేదా, అన్నంత సింపుల్‌గా ఉండకూడదు. సినిమా అనేది ప్రేక్షకులు తీవ్రంగా డిస్కస్ చేసుకుని ఆర్గ్యూ చేసుకునేలా ఉండాలి ఒక కొత్త తరనికి తెర తీయాలి అన్నాడు.
అయితే సందీప్ వంగ తన యానిమల్ చిత్రంతో దర్శకుల వీపు పగిలిపోయేలా కొట్టి నిరూపించాడు. బాక్సాఫీస్ రన్ ముగిసిన తర్వాత చాలా సంవత్సరాల వరకు కూడా యానిమల్ సినిమాకి సంబంధించిన వాదనలు కొనసాగుతాయి. అంతే కాకుండా ఈ సినిమా హిపోక్రిసీ యొక్క బట్టలుడదీసి పూర్తి నగ్నమైన నిజాయితీనీ విశ్వరూపంతో చూపించడంతో ఎంతో కొంత మన సంస్కృతిని కూడా మార్చిపారేస్తుంది అని నా ప్రఘాడ నమ్మకం. ఎందుకంటే యానిమల్ అనేది ఒక సినిమా కాదు .. అది ఒక సోషల్ స్టేట్మెంట్.
నాకు ఈ సినిమా కథ కానీ, తండ్రి కొడుకుల బంధం కానీ అసలే ఎక్కలేదు. కానీ ఈ సినిమాలో బాగా నచ్చిందేమింటంటే అలాంటి పాత కథలను బేస్‌గా చేసుకుని సందీప్ మునుపెన్నడూ చూడని సీన్లని అద్భుతంగా చూపించడం సినిమా అంటే ఇలాగే వుండాలని అనుకునే డైరెక్టర్లందరికీ ఫ్యూజులు ఎగిరిపోయేలా ఒక ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చాడు సందీప్. దర్శకుల నమ్మే చాదస్తపు నైతిక విలువులన్నింటినీ తన చీపురు కట్టతో ఊడ్చి ఎత్తి చెత్త కుండీలో పడేసాడు.
యానిమల్ సినిమా స్లోగా ఉన్నప్పటికి చాలా సార్లు మనం షాక్ అవుతాము.. దానికి కారణం సినిమా స్లోగా ఉండటమే అని తర్వాత తెలుసుకుంటాము.. నా ఉద్దేశ్య లో ఈ సినిమా మూడున్నర గంటలు కాకుండా నాలుగున్నర గంటలున్నా తక్కువే. హీరో వెళ్లి బేస్ బాల్ బ్యాటో ఇంకా ఎమైనా పట్టుకుని వస్తాడేమో అని నాతోపాటు థియేటర్లో ఉన్న అందరూ ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో మెషీన్ గన్‌తో రావటం అన్నది థియేటర్లో మా అందరినీ కుర్చీలోనుంచి కింద పడేంత ఎఫెక్ట్ ఇచ్చింది.
“హ్యాపీనెస్ ఈజ్ ఎ డెసిషన్” అని రణబీర్ సింపుల్ గా చెప్పిన డైలాగ్ తత్వవేత్తలందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. ఇక మీ మీద ఈగ వాలినా సరే ఢిల్లీని తగలబెట్టేస్తాను అనే మాట రణబీర్ తన తండ్రికి చెప్తున్నప్పుడు సినిమాటోగ్రఫీ పరంగా, ఎడిటింగ్ శైలి పరంగా ఆ పాత్రను ఎలివెట్ చెయ్యటానికి తీసుకున్న ఎక్కువ టైం కేక్ మొత్తం తయారీ చేయడం చూపించి ఐసింగ్ పెట్టినట్లు అనిపించింది. ఇక ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఫైట్‌లో వాడిన అర్జున్ వాయ్లీ పాట , మైకేల్ జాక్సన్ “బీట్ ఇట్” మ్యూజిక్ వీడియోని గుర్తు చేసింది.
ట్రెడిషనల్ సినిమా రూల్స్‌ని కడుపులో గుద్దుతూ, తన కాళ్లతో తన్నినందుకు సందీప్‌ను జీర్ణించుకోలేక, కడుపు నొప్పితో నేల మీద పడి దొర్లడం తప్ప విమర్శకులు ఇంకేం చెయ్యలేరు ఇక్కడ “ఆర్ట్ ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈజ్, ఆర్ట్ ఈజ్ అల్సో వాట్ ఇట్ కుడ్ బీ (కళ అంటే అది కాదు, కళ కూడా అది కావచ్చు) అని ఐయాన్ రాండ్ చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవాలి.
నిజంయొక్క దుమ్ము దులిపేసి దాని అసలు రూపాన్ని ఏ మాత్రం కలరింగ్ లేకుండా నిజంగా చూపించిన ఒక నిజమైన కళాకారుడు సందీప్. దీనికి ఉదాహరణ మూవీలో అప్పుడప్పుడు వచ్చే.. బ్రా స్ట్రాప్ స్పాంకింగ్, సెక్స్ గురించి డాక్టర్లతో మాట్లాడుతున్నప్పుడు లాంటివి చెప్పుకోవచ్చు.
ఇలాంటివి సినిమాకు అవసరం లేదేమో అనిపించినా కేవలం హీరో పాత్ర స్వభావాన్ని ప్రేక్షకుల మెదళ్ళల్లలోకి మేకులు కొట్టి దించడమే ఇక్కడ డైరెక్టర్ లక్ష్యం
తన భర్తని తమ్ముడు విజయే(రణబీర్) చంపాడు అని తెలిసిన తర్వాత విజయ్‌ని తన అక్క కొట్టడం. తరువాత విజయ్ తనకి ఎక్స్ప్లెయిన్ చేసే సీను ఫ్రాన్సిస్ కాప్పొల గాడ్ ఫాదర్ సీన్‌కి బాబులా వుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రాన్సిస్ కాప్పొల సందీప్ దగ్గర అసిస్టెంట్‌గా చేరాలి.
ఇందులో విలన్‌గా బాబీ ఇంట్రడక్షన్ సినిమా చరిత్రలోనే అంతముందెప్పుడూ లేనంత అత్యంత వరిజినల్గా ఉంది.. ఎందుకంటే ఒక స్ప్లిట్ స్క్రీన్ ఎఫెక్ట్ లో అతన్ని ఒక పెళ్లి కూతురి మేని ముసుగు తీసినట్టు ఆవిష్కరించడం జస్ట్ జీనియస్. తాను పూర్తిగా కోలుకున్నాను, ఆరోగ్యవంతుణ్ణయిపోయాను అని చెప్పటానికి హీరో తన కుటుంబం ముందు నగ్నంగా నడిచే సీన్ నెవర్ బిఫోర్ ఈవెన్ ఇన్ వరల్డ్ సినిమా
విజయ్ పాత్రకి సంబంధించి నాకు నచ్చని ఒకే ఒక సన్నివేశం, అమ్మాయిని విజయ్ తన బూట్లు నాకమని ఆర్డర్ ఇవ్వడం.. ఆ సీన్ ఎందుకంటే.. ఆ నటిని ఎంచుకున్న తీరు, తనని చూస్తూనే నాకు కలిగిన సానుభూతి, తనని చూపించిన ప్రతి క్లోజ్ షాట్లో అది పెరుగుతూ రావడమే. కండోమ్ వాడావా ? అని హీరోని రష్మిక అడిగే సీనూ, అది రాసి తీసిన తీరు అద్భుతం. రష్మీక నటనకి నేను క్లీన్ బౌల్డ్ అనే చెప్పాలి
ట్రైలర్స్ చూసినప్పటి నుంచి రన్బీర్ ఏమైనా కొంచెం ఓవర్‌గా వెళుతున్నాడా అన్న ఫీలింగ్ నాకు లోలోపల ఉండింది. కానీ ఒక ఫిల్మ్ మేకర్‌గా, ప్రేక్షకుడిగా, మొదటిసారి రన్బీర్ నటన సందీప్ రాసిన క్యారెక్టర్‌ను మోస్తుందా? లేదా సందీప్ క్రియేట్ చేసిన క్యారెక్టర్ రన్బీర్ నటనని మోస్తుందా? అన్న కన్ఫ్యూషన్ లో పడేసింది నన్ను.
రణబీర్ నటనలో వున్న కన్సిస్టెన్సీ 1913లో వచ్చిన రాజా హరిశ్చంద్ర నుంచి ఇప్పుడు 2023 వరకూ , నూట పది సంవత్సరాలలో ఏ యాక్టర్ చూపించలేకపోయాడు. ఆ అమ్మాయిని తన బూటు నాకమనే ఒక్క సన్నివేశంలో తప్ప రణబీర్ లియోనార్డో డి కాప్రియోని కూడా మించిపోయాడు. హేయ్ @imvangasandeep దయచేసి నీ కాళ్ళ ఫోటో నాకు వాట్సాప్ లో పంపిస్తే మొక్కుకుంటాను
దానికి కారణాలు
1.కెమెరా కనిపెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకూ అందరూ నమ్ముతున్న సినీ సంప్రదాయాలన్నింటిని నీ ఎడమ కాలి బూటుతో తన్ని రక్తాలు కక్కుకునేలా చేసావు.
2.ఇకనుంచి బాలీవుడ్లో కానీ ,టాలీవుడ్లో కానీ, ప్రతి సినిమా ఆఫీస్‌లోనూ నీ యానిమల్ సినిమా టాపిక్ ఒక దెయ్యంలా ఆవహించి.. వాళ్ళు తర్వాత తియ్యబోయే ప్రతి సినిమాని పీడిస్తుంది.
నేను ముందే చెప్పినట్టు, ఆ అమ్మాయిని షూ నాకమని నువ్వు రన్బీర్ తో చెప్పించిన ఆ ఒక్క షాట్ నాకు నచ్చకపోయినా, అనిల్ లాస్ట్ డైలాగ్ నుంచి జంప్ కట్ తీసుకుని ఎండ్ టైటిల్స్ కి వెళ్ళినప్పుడు కెమెరా జూమ్ అవుట్ షాట్లో శక్తి కపూర్ ఒళ్ళో చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న రన్బీర్ షాట్ ఒక్కదాని కోసం, నేను మీ ఇద్దరి షూస్ నాకుతాను అంటూ రామ్ గోపాల్ వర్మ రాసుకోచ్చాడు.
“యానిమల్ ” సినిమా గురించి నా రివ్యూ
– రామ్ గోపాల్ వర్మ https://t.co/QlP7onjEQY
— Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2023