Animal Movie | బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘యానిమల్’ (Animal). అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా కేవలం మూడో రోజుల్లోనే రూ.350 కోట్ల మార్కును దాటేసింది. ఇక ఈ చిత్రంలో రణబీర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా అరుదైన రికార్డు సాధించింది.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కలెక్షన్ల పరంగా అరుదైన రికార్డు సాధించింది. వరల్డ్ వైడ్‌గా వీకెండ్ టాప్ టెన్ కలెక్షన్స్ (Weekend Top Ten Collections) లిస్ట్‌లో ‘యానిమల్’ సినిమా మొదటి స్థానంలో(Jawan First Place) నిలిచింది. ఈ విషయాన్ని కమ్స్కోర్ సంస్థ వెల్లడించింది.
No. 1 film globally over the weekend 🪓💪#AnimalHuntBegins
Book Your Tickets 🎟️ https://t.co/kAvgndK34I#Animal#AnimalInCinemasNow #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23@imvangasandeep #BhushanKumar @VangaPranay… pic.twitter.com/iXyMI2PPrG
— Animal The Film (@AnimalTheFilm) December 4, 2023
ఇక ‘యానిమల్’ ఆదివారం కలెక్షన్స్ చూస్తే.. వరల్డ్‌వైడ్‌గా రూ.356 కోట్లు వసూళ్లు రాబట్టింది. కేవలం ఇండియాలోనే దాదాపు రూ.201కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మార్కెట్ వారీగా చూస్తే.. హిందీలో రూ.176 కోట్లు, తెలుగుకన్నడ, తమిళ్, మలయాళం కలిపి మొత్తంగా రూ.25 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం.