Animal Movie | బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) కాంబినేషన్ లో వస్తున్నా తాజా చిత్రం ‘యానిమల్’(Animal). ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మంధాన (Rashmika Mandana) హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్ విడుదల చేయగా సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే విడుదల తేదీకి ఇంకా 06 రోజులే గడువు ఉండడంతో మేకర్స్ ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ‘యానిమల్’ అడ్వాన్స్ బుకింగ్స్ ( Animal Movie Advance Bookings) ఈరోజు ఉదయం నుంచి స్టార్ట్ అయ్యినట్లు చిత్రబృందం సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇక ఈ సినిమా చూసేందుకు ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎగబడుతుండగా.. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే పెద్ద మొత్తంలో కలెక్షన్లు వస్తాయని చిత్రబృందం ధీమాగా ఉంది. https://in.bookmyshow.com లింక్ ద్వారా ఈ మూవీ టికెట్లను బుక్ చేసుకోవచ్చని చిత్రబృందం తెలిపింది.
ఇక ఈ సినిమాలో బల్బీర్ సింగ్ గా అనిల్ కపూర్ నటిస్తుండగా. గీతాంజలిగా రష్మిక నటిస్తుంది. ఈ సినిమాలో బాబీ డియోల్, సీనియర్ నటుడు పృథ్వీ రాజ్ విలన్ రోల్స్‌లో నటించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బాబీ డియోల్ లవ్ హాస్టల్ (Love Hostel) సినిమాలో విలన్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక యానిమల్‌లో బాబీ రోల్ ఎలా ఉంటుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది.