Karan Johar | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం యానిమల్ (Animal). సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించాడు. కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. తృప్తి డిమ్రి మరో కీ రోల్లో నటించింది. డిసెంబర్ 1న హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం తొలి రోజు నుంచి నేటి వరకు సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
యానిమల్ బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించింది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన యానిమల్‌పై బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) ప్రశంసల వర్షం కురిపించాడు. నాకైతే 2023లో యానిమల్ ఉత్తమ చిత్రం. మీరు జనాల చుట్టూ ఉన్నప్పుడు వారిచ్చే తీర్పు గురించి భయపడతారు. ఆ తర్వాత ధైర్యం వచ్చింది. ఈ ప్రకటన చేసేందుకు నాకు కొంత సమయం పట్టింది. నాకు కబీర్‌సింగ్ కూడా చాలా బాగా నచ్చింది. నేను కబీర్ సింగ్‌ను ఇష్టపడుతున్నానని చెబితే, కొంతమంది వ్యక్తుల నుండి నాకు డర్టీ లుక్ వచ్చేదనుకున్నా. కానీ ఇప్పటి నుంచి నేను వాటిని ఇక పట్టించుకోను. యానిమల్‌లో ఇంటర్వెల్ సీక్వెన్స్, క్లైమాక్స్ బాగా రూపొందించబడ్డాయి. ఈ మూవీని విభిన్నంగా తెరకెక్కించారు.. యానిమల్కు మూవీ లవర్స్ నుంచి ఆమోదం రావడం.. గేమ్ ఛేంజింగ్ లాంటిది.
తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన యానిమల్ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. యానిమల్ పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్.. ఇలా ప్రతీ ఒక్కటి సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. ఈ మూవీలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. యానిమల్ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మించారు.
తృప్తి డిమ్రి మెస్మరైజింగ్ లుక్స్..
#TriptiDimri pic.twitter.com/pNCqVPwHCm
— StepUp Media (@stepup_media) December 2, 2023
Hottie in black 🖤❤️🔥🔥🥵🌶️#TriptiDimri #TriptiiDimri #RanbirKapoor𓃵#AnimalMovie #AnimalPark #Animal @Portalcoin $Portal #AnimalTheMovie pic.twitter.com/yUKrbTQbUJ
— FRAAZ (@fraaz0208) December 3, 2023
She is very talented and beautiful actress #TriptiDimri pic.twitter.com/1xzve7IUEm
— Rishi Gupta (@rishig51) December 3, 2023
Someone Asked For Cheri Cheri Lady Version >>>
Tek ✨ #TriptiDimri #Animal pic.twitter.com/cjHM6hXeW4
— AsHu ⚓⚡ (@name_is_ashtosh) December 3, 2023
Two things trending in TL from yesterday… #TriptiDimri and this Song ❤❤#Animal pic.twitter.com/qWKddUBEUU
— MR Solo 2.0 (@SolidLover123_) December 3, 2023