Anil Ravipudi | రాజమౌళి తర్వాత టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు అనీల్ రావిపూడి. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలలో ఒక్క ఫ్లాప్ లేదు. సంవత్సరాలు కాకుండా రోజులలోనే చిత్ర షూటింగ్ పూర్తి చేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అనీల్ రావిపూడి అంటే కామెడీ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ అన్నట్టు మారింది. జనాల పల్స్‌ని పట్టిన అనీల్ నేటి సమాజంలో జరుగుతున్న పరిస్థితులు ఆధారంగా సినిమాలు తెరకెక్కించి మంచి హిట్స్ అందుకుంటున్నాడు. చివరిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు.
ప్రస్తుతం చిరంజీవి మూవీకి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ మే తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఇప్పుడు అనీల్ రావిపూడికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. అనిల్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు ఫ్లైట్ ఫోబియా ఉందని , . విమానం ఎక్కినప్పుడల్లా అది కూలిపోయి చచ్చిపోతాననే భయం తీవ్రస్థాయిలో ఉండేదని చెప్పారు. విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత ఆకాశంలో ఉండే గాలి వేగానికి విమానం ఎక్కడ సముద్రంలో కూలిపోతుందో లేదంటే గాల్లోనే ఎక్కడ క్రాష్ అవుతుందో అని భయపడేవాడట. ఆ కారణంగా కొన్నిసార్లు ఫ్లైట్ ఎక్కకపోయేవాడట.
తొలిసారిగా 2009లో ఫ్లైట్‌లో ఆస్ట్రేలియా వెళ్లినట్టు చెప్పిన అనీల్ ఆ తర్వాత చాలా ఏళ్లు అసలు విమానం ఎక్కలేదని చెప్పారు. ఫ్లైట్ ఫోబియాతో అనేక ఇబ్బందులు పడ్డానని కాని చివరికి తనకు తానే ఆ భయాన్ని ఓవర్‌కమ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఆ ఫోబియాని పోగొట్టుకునేందుకు గాను ఎక్కువగా పుస్తకాలు చదవడం, అసలు విమానం కూలిపోయేందుకు ఎంత శాతం అవకాశం ఉందని గూగుల్‌లో వెతికేవాడట. అయితే కూలిపోవడంకి అవకాశం 0.9 శాతం మాత్రమే అని తెలుసుకున్నాను. టర్బులైన్స్ వల్ల విమానానికి ఏదైనా ప్రమాదం జరిగితే అది క్రాష్ కాదని తెలుసుకున్నానని, ఆ తర్వా తనకు ధైర్యం వచ్చిందని అన్నారు. భయాన్ని పోగొట్టుకునేందుకు రెగ్యులర్‌గా ఫ్లైట్లలో ప్రయాణించినట్లు చెప్పుకొచ్చారు. కొన్నిరోజులైతే ఉదయం ఒక విమానం, సాయంత్రం ఒక విమానంలో ట్రావెల్ చేసినట్లు తెలిపారు. అలా నెమ్మదిగా ఆ ఫోబియాని అధిగమించి ఇప్పుడు హ్యాపీగా విమానం ఎక్కుతున్నట్లు దర్శకుడు అనిల్ చెప్పారు